-
-
శ్రీనాధుఁని సాహితీ వైభవము
Srinadhuni Sahiti Vaibhavamu
Author: Sivkishen
Publisher: Self Published on Kinige
Pages: 277Language: Telugu
యుగకర్త అయిన శ్రీనాథుడు మహాపండితుడు, విద్యాధికారి, వ్యవహార్త, కార్యనిర్వాహక నిపుణుడు. మూడుమార్లు దేశాటనము చేసి శాస్త్ర జ్ఞానమునకు లోకజ్ఞతను జోడించాడు. ఇతడు నైషధము, భీమ పురాణము, కాశీఖండము, పల్నాటి వీరచరిత్ర, హర విలాసము, క్రీడాభిరామము, శివరాత్రి మహాత్మ్యము వంటి గ్రంథములను రచించాడు.
శ్రీనాథుని సాహితీ వైభవములో తెలియపర్చే కొంగొత్త విషయాలు శ్రీనాథుడు ఎంతటి "ఆధునికుడో” అర్థమౌతుంది. మనం ఇప్పుడు నిజమైన ఆధునికతకు లక్షణాలుగా పరిగణిస్తున్నవి అన్నీ ఏడు వందల ఏళ్ళ క్రితమే ఈ లక్షణాల్ని సంతరించుకున్న శ్రీనాథుడు జనబాహుళ్యంలోకి ఎంతగా చొచ్చుకుపోయాడో విపులంగా, ఉదాహరణల్తో కలం కదిలించి వ్రాశారు గ్రంథకర్త శివకిషెన్ జీ!
ఈ గ్రంథరాజం తెలియపర్చే యదార్ధాలు, అరుదైనవి, అద్బుతమైనవి, అపూర్వమైనవి, అనితరమైనవి.. ఇంతవరకు తెలుగులో ఎక్కడ కూడా దీనిని పోలిన మేటి దివ్య సాహితీ వైభవ గ్రంథం రాలేదు! శ్రీనాథుని ఈ ఉత్తమ తెలుగు సాహితీ సంపద అద్భుత విషయాలు చదువరుల ‘వ్యక్తిత్వ వికాసం’ పెంపొందిస్తుంది... మన సంస్కృతి ఔన్నత్యం ఏమిటో చాటి చెప్పుతోంది.....
శ్రీనాథుని సాహితీ వైభవము చదవండి....చదివించండి ...
- వినోద్ సింగ్
గమనిక: " శ్రీనాధుఁని సాహితీ వైభవము " ఈబుక్ సైజు 10mb
శ్రీనాధుఁని సాహితీ వైభవము....చదవండి.....చదివించండి.... శివకిషెన్ జీ, గ్రంథకర్త