-
-
శ్రీమద్వాల్మీకి రామాయణమ్
Srimadvalmiki Ramayanam
Author: Dr. N. L. Narasimhacharya
Publisher: Gayathri Prachuranalu
Pages: 690Language: Telugu
శ్రీమద్వాల్మీకి రామాయణమ్ (మూలమ్)
పారాయణ విధి సముపేతమ్
తల్లిదండ్రులు, సోదరులు, గురువులు, పెద్దల పట్ల ఆదర్శ ప్రవర్తనావళిని పాటించడంలోను, ఆదర్శ దాంపత్యంలోను, పరిపాలనా దక్షతలోనూ సీతారాములు ప్రపంచానికే ఆదర్శం. కేవలం నామస్మరణతోనే మోక్షాన్ని ప్రసాదించేది రామనామము. ఇంతటి ఘనమైన రామాయాణము నందలి ఒక్కొక్క కాండ , మానవ జీవితంలోని పలు సమస్యలకు తగిన పరిష్కారాలను చూపుతుంది. కనుక ఎంతో మహత్యము కలిగిన రామాయణమును నిత్యం పారాయణ చేయుట సర్వ శ్రేష్టమైనది.
రామాయణ పారాయణం అమిత శ్రేయోదాయకమని పెద్దల వాక్కు
శ్లో: రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరమ్ ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్
రామాయణ పారాయణం వల్ల లభించే ఫలితాలు అనంతం.
అటువంటి సత్ఫలితాలను అందరికీ అందించాలనే సదుద్దేశంతో, విద్వాంసులకు, సామాన్యులకు సులభంగా గ్రాహ్యమయ్యే రీతిలో కూర్చి అందించారు డా. నల్లంతిగళ్ లక్ష్మీ నరసింహాచార్య. ఈ పవిత్ర గ్రంథాన్ని హైదరాబాద్‌కు చెందిన గాయత్రి ప్రచురణలు వారు భక్తులు సులభంగా పారాయణం చేసుకునేడట్లుగా ఆరు కాండలను, రెండు భాగాలుగా చేసి, అక్షరాల సైజుని పెంచి వృద్ధులకు సైతం ఉపయోగపడేట్లుగా ప్రచురించారు.
ఆ రెండు భాగాలనూ ఒకే ఈ-బుక్‌గా అందిస్తోంది కినిగె. రామాయణ పారాయణం చేయండి, మీ కోరికలను సిద్ధింపజేసుకోండి.
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
The people who atleast want to touch the book Ramayana and recite the name of RAMA is really a Dhanya jeevi.It is a good and pious attempt to bring Sri Madramayana and it is the turn of the readers to get immersed in the nectar of its bliss and punya.May God Bless all who want to read Raamayana and get benifitted by its greatness of knowledge and attain blissful state of mind.Sankar.allena@gmail.com