-
-
శ్రీమద్రామాయణము
Srimadramayanamu
Author: Chilukuru Venkateswarlu
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 1059Language: Telugu
భారతీయుల కల్పవృక్షం – ‘శ్రీమద్రామాయణం’. ఈ మహా ఇతిహాసం యుగాల నాటి కథ అయినప్పటికీ నేటికీ నిత్యనూతనమై అలరారుతుంది. దానికి కారణం మానవ జీవన స్రవంతిలో సర్వవేళలా కలిసి ప్రవహించి, ప్రభావం చూపగలిగే అనిర్వచనీయ దివ్యశక్తి ‘రామాయణం’లో దర్శనమివ్వడమే.
ఎంతకాలం ఈ భూమండలంపై పర్వతాలు సుస్థిరంగా నిలిచి ఉంటాయో, ఎంతకాలం ఈ ధరణీతలం తరంగిణీ ప్రవాహాలతో విలసిల్లుతూ ఉంటుందో అంతకాలం శ్రీరాముని కథ – ‘శ్రీమద్రామాయణం’ నిత్యనూతనంగా భాసిల్లుతూ సర్వజన మనోరంజకమై వర్థిల్లుతుందని బ్రహ్మవాక్కు.
విశ్వసాహితీ చరిత్రలో ‘రామకథ’ ఒక అద్భుతం. ప్రతాపానికి, ప్రసన్నతకి, వీరత్వానికి, వినయానికి, ధర్మంపట్ల ఆదరణకి, అధర్మం పట్ల ఆగ్రహానికి, సామర్థ్యానికి, సంయమనానికి నిలువెత్తు తార్కాణం శ్రీరామచంద్రుడు. సునిశిత రాజనీతి, సచ్ఛీలత, సత్యనిష్ఠ, అందరినీ అక్కున చేర్చుకునే అపారప్రేమ శ్రీరామచంద్రుని వ్యక్తిత్వ కాంతిరేఖలు.
‘శ్రీమద్రామాయణం’ అందరూ అనుసరించాల్సిన ఆదర్శం. ధర్మవైభవాన్ని తెలియచెప్పే అసామాన్య ధార్మిక గ్రంథం.
- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹108
Pl. enable rent option for this book.