-
-
శ్రీమద్రామాయణ కల్పవృక్ష అంతర్దర్శనం
Srimadramayana Kalpavruksha Antardarshanam
Author: Jonnavittula Ramakrishna Sharma
Language: Telugu
శ్రీ శర్మగారి వంటి సర్వతోభద్రమైన పాండిత్యం, భావుకత, సాహిత్య సౌందర్య దర్శనం అక్షర శిల్పవిన్యాస జిజ్ఞాసా సాహిత్య లోకంలో చాలా అరుదుగా సమకూరే విషయాలు. ఆయన గొప్ప లలితకళోపాసకులు. సంగీతసూక్ష్మాలు తెలిసిన గాయకుడు, గాఢ పరిశ్రమ కలిగినవారు. ప్రముఖ ఇండాలజిస్టు రాధాకుముద్ ముఖర్జీ సేకరించిన కళాకృతులకు ప్రతిలేఖనం చేశారు. ఆధునిక విమర్శకులలో శర్మగారు అత్యంత ఆధునికులు. సంప్రదాయ విమర్శకులలో శర్మగారు పరమ విశిష్ట సంప్రదాయవేత్త. ఫ్రెంచి విప్లవం, కార్లైల్ నుంచి శంకర భగవత్పాదుల సౌందర్య లహరి దాక సాహిత్య తత్వ విచికిత్సలో వారు సమన్వయం చెయ్యగలరు. మనుచరిత్రపై వారు రాసిన వ్యాఖ్యానం న భూతో న భవిష్యతి అనవలసి ఉంటుంది. అందులోని ప్రతీ పద్యమూ రాగలయల సంగీత మాధుర్యానికి నెలవుగా నిరూపించారు. మల్లినాథసూరి ఈ వ్యాఖ్యానం చూసివుంటే వారిని ఎంతగానో కొనియాడి వుండేవారు. అదీ త్వరలోనే వెలుగు చూస్తుందని ఆశిస్తూ.....
- అక్కిరాజు రమాపతి రావు
30-1-2008
హైదరాబాదు
