• Srimadbhagavatamu Josyula Rama Prasad
  • fb
  • Share on Google+
  • Pin it!
 • శ్రీమద్భాగవతము - జోస్యుల రామప్రసాదు

  Srimadbhagavatamu Josyula Rama Prasad

  Pages: 635
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

మానవ జన్మ పొందుట ఎంత దుర్లభమో, మానవ జన్మను సార్ధకమొనరించుకొనుట అంత కష్ట సాధ్యమైనది. ఇక మానవ జన్మను తరింపజేసికొనుటకు ముఖ్యమైనది మానవుడుగానున్నపుడు మాత్రమే సాధ్యము. మానవజన్మకంటే ఉత్తమమైన దేవజాతులయందు జన్మను తరింపజేసికొనుట సాధ్యముగాదు. ఎంతో సౌఖ్యము కల్గించుచు, ఆనందమునందించు జన్మలు దివ్యజాతుల జన్మలు. వారు పుణ్యమున్నంతకాలము స్వర్గాదులందు సౌఖ్యముననుభవించి పుణ్యఫలమైపోగా తిరిగి మానవ జన్మయో లేక నీచ జంతు జన్మయో లేదా అప్పటికంటే ఉత్తమమైన దివ్యజాతి జన్మయో పొందుదురు. కాని పరమాత్మైక్యస్థితినందింపగలది, జన్మను తరింపజేయగలది మానవజన్మ మాత్రమే. అట్టి జన్మ తరణమును గూర్చి, దానికి సాధన మార్గమగు భగవత్తత్త్వ విజ్ఞానమును గురించి తెలియ చెప్పునది శ్రీమద్భాగవతమే. ఇందు భగవంతుడు తెల్పునది ప్రధానముగనుండును. భగవంతుడు తన తత్త్వమును తానే విశదీకరించి, భక్తుని తనలో లీనమొనర్చుకొను మార్గమును తెల్పునది భాగవతము. భగవంతునియందైక్యమగుటకు సాధన చేసిన ప్రాణులను వాని సాధన మార్గములను తెలుపునది భాగవతము. ముఖ్యముగా మానవులను బుద్ది జీవులుగా, చేసిన సాధనముల మార్గములను తెల్పుచు, ఎవరెవరు ఎంత వరకు సాధించి, ఆటంకములురాగా విఫలమై, తిరిగి సాధన మార్గమున భగవంతునిచే చేర్పబడి, భగవదైక్యమొందిరో వారిని భాగవతమందు బహుళముగ దర్శింపజేయును. ఎవరికి వారు తాము సాధన మార్గమున ఏ స్థితియందున్నారో భాగవతరసాస్వాదనమను భగవదనుగ్రహఫలమును త్రావునప్పుడు తెలిసికొని ముందుకు వెళ్లునట్లు భాగవతము ప్రోత్సహించును. ఒకవేళ భగవదైక్యము ఒక జన్మలో కలుగకపోయినను తరువాత జన్మలలోను మోక్షస్థితిని కల్గించి, పరమాత్మైక్యస్థితినందించును. అందుచే ఆయా మార్గముల సాధన క్రమములను అవగాహనమొనర్చుటకు సూచన అందించుటకే, భగవంతుడు నాచే ఈ ప్రయత్నమొనరింపజేసినాడు.

- జోస్యుల రామప్రసాదు

Preview download free pdf of this Telugu book is available at Srimadbhagavatamu Josyula Rama Prasad