-
-
శ్రీమద్భాగవతము
Srimadbhagavatam
Author: Dr. Elchuri Muralidhra Rao
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 2133Language: Telugu
"శ్రీమద్భాగవతం" మూడు సంపుటాలు కలిసిన ఈ-బుక్ ఇది. మొదటి సంపుటములో - ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ స్కంధములు; రెండవ సంపుటములో పంచమ షష్ట సప్తమ అష్టమ నవమ స్కంధములు; మూడవ సంపుటములో దశమ ఏకాదశ ద్వాదశ స్కంధములు ఉన్నాయి.
* * *
శ్రీమద్భాగవతం అష్టాదశ మహాపురాణాలలో అవిరళ ప్రచారానికి నోచుకొన్న వాసుదేవ కథా కలశ రత్నాకరం. స్వరబ్రహ్మ భూషితమైన పవిత్ర వాగ్వీణపై పారాశర్య మహర్షి మ్రోయించిన ఆత్మ సంగీతాన్ని నిర్విక్రియుడైన శుకయోగి ఉపదేశింపగా సన్నిహితమరణుడైన పరీక్షిన్న రేంద్రుడు ఆలకించిన భక్తి యోగసారం.
కర్మజ్ఞానశాస్త్రానుషాసనాలతో సాధింపరాని మోక్షఫలాన్ని హరినామ సంకీర్తనతో అవలీలగా పొందవచ్చునని చాటి చెప్పిన మహేతిహాసం. వేదాంత ధర్మాన్ని విదగ్ధ కవితాశిల్పంతో అనుసంధించి శ్రీకృష్ణవైభవ ప్రకాశన కావించిన పుణ్య కథాకోశం.
భాగవతం సంసారాసక్తులైనవారు భగవత్ప్రాప్తిని సాధించే మార్గాన్ని మనస్సులకు హత్తుకొనే మధురమైన సంవిధానంతో బోధిస్తున్నది. అనుభవైక వేద్యమైన ఈ సత్యాన్ని శ్రీకృష్ణ జీవిత సందేశంగా వినిపించిన మహాగ్రంథం ఇది.
భాగవతం భక్తిరసాయనం. సర్వరసాశ్రయుడైన శ్రీకృష్ణపరమాత్మ లీలా మానుషవిగ్రహుడై కావించిన చర్యలలో భాగవత ధర్మం సమ్మోహనకరమై ప్రకాశించింది. వ్రజకులావాసంలోని మధుర శృంగారం, రాజవంశాల మధ్య చెలరేగిన సంగ్రామాలలో రక్తపాతం, ఋష్యాశ్రమాలలో హరికథాశ్రవణ ఫలంగా జిగిదేరిన తత్త్వనవనీతం - అన్నీ ధర్మరక్షణ కోసం నేలకు దిగివచ్చిన ఆయన జీవితంలో ఐక్యం చెంది భాగవతం పవిత్ర గ్రంథమై భక్తులను పులకింపజేస్తుంది.
వ్యాస హృదయాన్ని ఆవిష్కరించం మహానుభవం కలిగిన పండితులకే తప్ప అనభిరూపులకు సులభం కాదు. అదీకాక ఛందోబద్ధమైన గ్రంథాల కంటె సర్వసుబోధ్యమైన వ్యావహారశైలిలో రచింపబడిన కృతుల అవసరం సాహిత్యంలో ఎప్పుడూ ఉంటుంది. ఆధునిక పాఠకులకు ఉపయుజ్యమైన ధోరణిలో సులభశైలిలో సరిక్రొత్తగా వచనంలో శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు రచించారు.
రామకృష్ణ మఠం ప్రచురణలను ఎంతో ఆసక్తితో ఆదరిస్తున్న పాఠక లోకం దీనిని కూడ తప్పక అనుశీలింపగలదని ఆకాంక్షిస్తున్నాము.
- ప్రకాశకులు
- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹108
Kindly provide a print book