-
-
శ్రీమద్భగవద్గీత - రెండవ సంపుటం
Srimadbhagavadgita Volume 2
Author: Dr. Munjuluri Narasimharao
Publisher: Self Published on Kinige
Pages: 615Language: Telugu
ఈ రెండవ భాగంలో పన్నెండు అధ్యాయాలున్నాయి. (మొదటి సంపుటం ఇక్కడ. )
* * *
భగవద్గీతకి ఎన్నెన్నో వ్యాఖ్యానాలుండగా మళ్ళీ ఈ వ్యాఖ్యానం అదనంగా ఎందుకు అనే ప్రశ్న పాఠకసాధకుల మనస్సులో పుట్టడం సహజమే. దీనికి జవాబు 'తిన్న అన్నమే తింటున్నామన'నే భౌతిక కారణం కాదు. ఎంతెంతమంది రాసినా ఏవేవో విషయాలు మిగిలిపోతునే ఉంటాయి. వేదంలోని మంత్రాలతోనూ, ఉపనిషత్తుల్లోని వాక్యాలతోనూ దీన్ని బలపరచడం ఒక కారణంగా పైకి కనిపిస్తున్నా అసలైన కారణం యోగశాస్త్రంగా భగవద్గీతకు వ్యాఖ్యానం తెలుగులో లేదన్నదే. యోగాలతో నిండి ఉన్న భగవద్గీతకు యోగపరంగా వ్యాఖ్యాన్నన్ని మొట్టమొదటిసారిగా లోకానికి ప్రసాదించినది యోగేశ్వరులైన శ్రీ శ్యామ్చరణ్ లాహిరీ మహాశయులు. ఆయనను అనుసరిస్తూనూ, స్వతంత్ర్యంగా వ్యాసచైతన్యంతో శ్రుతి చేసుకొని రాసిన పరమహంస యోగానందుల వ్యాఖ్యానాన్ని అనుసరిస్తూనూ, లాహిరీ మహాశయుల ప్రత్యక్ష్యశిష్యులైన స్వామీప్రణవానందులూ, స్వామీ శ్రీ యుక్తేశ్వరగిరి మహాశయులూ రాసిన వ్యాఖ్యానాలను సంత్జ్ఞానేశ్వరుల జ్ఞానేశ్వరినీ పరామర్శిస్తూను, ఆ మహానుభావుల ఆశీర్వచనబలం అదృశ్యంగా పనిచేస్తూ ఉండడంవల్ల ఈ వ్యాఖ్యానం తెలుగులోకి చేయడానికి పెద్ద సాహసమే జరిగింది.
ఆ మహానుభావుల భావాల మణులను దండగా గుచ్చి జపమాలగా సాధకులకు అందజేయడానికి ఇది తయారైంది. ఈ సాధకుడు ఆ జపమాలను చేయడంలో ఒక పరికరం మాత్రమే. దీన్ని తెలుగుభాషలోకి తీసుకురావడానికి ఏకైక కారణం సాధకుల ప్రయోజనమే. తీవ్రసంవేగంతో "సహజ కర్మ"ను చేసే సాధకమహాశయులకు ఈ యోగశాస్త్రపరమైన వ్యాఖ్యానం గొప్ప పురోగతిని సాధించిపెట్టగలదనే నమ్మకంతోనే ఈ సాహసం చేయడం జరిగింది. ఆ ప్రయోజనం ఒక్క సాధకుడికి కలిగినా ఈ ప్రయాస నిష్ఫలం కాదు.
- డా॥ ముంజులూరి నరసింహారావు
