• Srimadbhagavadgita Padachcheda Tika Tatparya Sahitam
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీమద్భగవద్గీత - పదచ్ఛేద టీకాతాత్పర్య సహితం

    Srimadbhagavadgita Padachcheda Tika Tatparya Sahitam

    Pages: 520
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీమద్భగవద్గీత వేదకాననమును సౌరభామోదితమొనర్చే సిద్ధాంత - కుసుమాల సంగ్రథితమైన వనమాల; రసప్లుతమై, ఛందో మాధుర్యంతో అపూర్వమై దీపిల్లే ఆధ్యాత్మిక కావ్యగానం. ఏతత్తుల్యమైన గ్రంథం విశ్వ సాహిత్యంలో మృగ్యం. ఆచంద్రతారార్కం అమ్లానమై కాలచక్రధరుని గళసీమలో ఈ మాలా-మంత్రం అలంకరించే ఉండగలదు. ప్రస్థాన త్రయాంతర్గతమైన స్మృతి ప్రస్థానం అవడం వల్ల, భారతీయులకు ఇది పరమపూజ్యమూ, ప్రమాణమూ అవుతోంది. బృందావనంలో వేణుగానం కేవలం గోపికలకే ఆహ్వాన సంకేతం; కాని గీతానాదం అమృతమయ స్వరాలతో జగద్వాసులనందరినీ సర్వస్వాన్నీ త్యజించి, భగవచ్చరణ పద్మాలను ఆశ్రయించండని ఉద్బోధిస్తోంది. సాధకావస్థను, సిద్ధస్థితిని గీత అత్యంత విశదంగా వివరిస్తున్నది. కనుక, మర్త్యసీమలను దాటి భూమాసంప్రసాదాన్ని పొందగోరేవారికి ఇది అత్యంత ఉపాదేయము. ఈ అనువాదాన్ని కూర్చి సౌభాగ్యాన్ని బడసి నేనూ, నా లేఖినీ ధన్యులమయ్యాం.

ఇందు నవీన భాష్య ప్రవచనాడంబరం లేదు. మూల శ్లోకం, ప్రతిపదార్థం, ధారాళమైన అనువాదం, శ్రీధరీయ టీకానువాదం, అనువాదాన్ని విశదపరిచే పాద టీకలు (foot notes), సానువాద గీతా పాఠక్రమ-మాహాత్మ్యములు, టీకా తాత్పర్యయుత గీతా ధ్యానం, వేదాంత సూత్ర విషయకమైన గీతావాక్యాల సూచిక, శ్రుతి మూలమైన గీతాశ్లోక నిర్దేశం, తదితర శాస్త్ర వాక్యనిర్దేశం, విస్తృత విషయ సూచిక, దర్శన శాస్త్రాంశాలను విశదీకరించే ‘గీతాతత్త్వ’మనే భూమిక, సంగ్రహ శబ్దానుక్రమణికలు ప్రదత్తములయ్యాయి. పండితులకు సాధకులకు మాత్రమే కాక, కళాశాల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థి బృందానికి కూడా ఉపయోగకరమయ్యే విధంగా యథాసాధ్యం ప్రయత్నమొనర్చాము.

- స్వామి నిర్వికల్పానంద

Preview download free pdf of this Telugu book is available at Srimadbhagavadgita Padachcheda Tika Tatparya Sahitam