-
-
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం యుద్ధకాండ - మందర మకరందం
Srimadandhra Valmiki Ramayanam Yuddha Kanda Mandara Makarandam
Author: Vanam Jwala Narasimaha Rao
Publisher: Marumamula Venkataramana Sarma
Pages: 378Language: Telugu
ఇది యుద్ధకాండ. చాలా పెద్దకాండ. ఆరవకాండ. శ్రీరామపట్టాభిషేకంతో శుభ సమాప్తి. దీని తరువాత ఉత్తరకాండ కూడా వున్నది. కానీ దానిని వాల్మీకి మహర్షి రచించాడనే విషయంలో భేదాభిప్రాయాలున్నాయి. ఏది ఏమైనా, ఉత్తరకాండ పారాయణం సంప్రదాయంగా తోచదు. యుద్ధకాండ 131వ సర్గ శ్రీరామపట్టాభిషేక సర్గ. దానితోనే శ్రీరామాయణ పారాయణానికి మజ్ఞాలాశాసనం.
యుద్ధకాండలో కథాంశం కంటే యుద్ధవర్ణనలు ఎక్కువ. పాఠకులకు క్లిష్టంగా ఉంటుంది. దీనిని అనువక్త క్లుప్తంగా సుందరీకరించారు. ప్రతి సరకు తనదైన శైలిలో వ్యాఖ్య వ్రాస్తూనే పాఠక సౌలభ్యాన్ని దృష్టిలో వుంచుకొని మూలానికి, కథా సూత్రానికి భంగం కలుగనిరీతిలో క్లుప్తసుందరంగా వ్రాయడం జరిగింది. మందరం మొత్తాన్నీ నవలా పఠనంగా నడిపించినందువలన యుద్ధకాండలో కూడా మూలకథకు విధేయంగానే రచన సాగింది. అయితే చివరి సర్గలను కొంచెం విశేషంగా వ్యాఖ్యానిస్తే భవ్యంగా వుండేదనిపిస్తోంది. ఎలాగైతే ఏమి గాని, వాసుదాసస్వామి వారి చలవ జ్వాలాగారిపై ప్రసరించింది. వారిచేత తాను పలికిన కథను తాతగారు మనవడికి కథ చెప్పినట్లుగా జ్వాలాగారి చేత పలికించారు వాసుదాస స్వామి. ఇది జ్వాలా గారు చేసుకున్న సుకృతము. శ్రీరామానుగ్రహఫలము.
- చిలకపాటి విజయ రాఘవాచార్యులు
గమనిక: " శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం యుద్ధకాండ - మందర మకరందం " ఈబుక్ సైజు 5mb
- ₹324
- ₹324
- ₹194.4
- ₹324
- ₹538.92
- ₹480
- FREE
- ₹324
- ₹324
- ₹324
- ₹324
- ₹480