-
-
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం కిష్కింధాకాండ - మందర మకరందం
Srimadandhra Valmiki Ramayanam Kishkindha Kanda Mandara Makarandam
Author: Vanam Jwala Narasimaha Rao
Publisher: Marumamula Venkataramana Sarma
Pages: 249Language: Telugu
ఇది కిష్కింధాకాండ. శ్రీరామాయణంలో ఏమున్నదో, ఎందుకు చదవాలో వాసుదాస స్వామి వారి పీఠికతో బాటు తనదైన నిరుపమాన శైలిలో జ్వాలాగారు చక్కగా వివరించారు. శాబ్దిక విశేషాలనూ, శ్రీరామావతార వైభవాన్నీ, వైలక్ష్యాన్ని తెలియజేశారు. కావ్య 'అంతర ధ్వని'ని విగ్గడించారు. 'అవతారిక'లో అరణ్యకాండను కిష్కింధాకాండతో సందర్భాన్ని సూచిస్తూ అనుసంధించారు. కిష్కింధకాండ ప్రధానంగా ద్వయమంత్రమందలి ‘చరణో’ పదానికి వివరణమని పెద్దల నిష్కర్య. ఇది జ్ఞానకాండ. అరణ్యకాండ దీన సంరక్షణమనే ధర్మాన్ని శ్రీ రామచంద్రమూర్తి ఏ విధంగా అనుష్ఠించారో వివరిస్తుంది. మిత్రరక్షణమనే ధర్మాన్ని ఆవిష్కరిస్తుంది. శ్రీ రామచంద్రమూర్తి అసంఖ్యేయ కల్యాణ గుణాలను చక్కగా వివరిస్తుంది.
సరిగ్గా కాండ ప్రారంభంలోనే మహాద్భుతమైన, తాత్త్వికశబ్ద, అర్ధ్ర సంభరితమైన ‘పంపా’ వర్ణనతో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. బుద్ధిమతాంవరిష్టుడైన ఆంజనేయస్వామి పరివ్రాజక రూపురేఖా విలాసాలతో దర్శనమిస్తాడు. కొందరు మహానుభావులు కిష్కింధాకాండను 'హనుమ'కాండ అనవచ్చునంటారు. ఈ కాండలో వర్ణనలు విశేశంగా కన్పిస్తాయి. వర్షఋతు వర్ణనము (28 సర్గ), నాలుగు దిక్కులలో ఉన్న భౌగోళిక ప్రదేశ వర్ణనలు (40–44 సర్గలు), భాషా ప్రియులకు, ఆలోచనామృతాన్ని అందిస్తాయి. శ్రీరామ-సుగ్రీవ మైత్రి, వాలివధ విషయమై 'ధర్మ' చర్చ, సుగ్రీవునికి మొదటి యుద్దములో వాలి వల్ల పరాభవం, తార ధర్మ, లౌకిక ధర్మ వివరణం, లక్ష్మణ స్వామి భ్రాతృ భక్తి-ఇలాంటివెన్నో ధర్మసముచ్చయాలు కిష్కింధాకాండలో గ్రహిస్తాము.
- చిలకపాటి విజయ రాఘవాచార్యులు

- ₹324
- ₹324
- ₹194.4
- ₹324
- ₹538.92
- ₹480
- FREE
- ₹324
- ₹324
- ₹324
- ₹324
- ₹480