• Sriharidasulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీహరిదాసులు

    Sriharidasulu

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ మధ్వాచార్యులు, వారి అనుయాయులు భగవంతుణ్ణి భక్తితో స్మరించడానికి ‘కీర్తన’ అత్యంత పరిణామకారి అని భావించారు. ఆ కీర్తనలే ప్రధానమైన దాససాహిత్యం యొక్క ఆవిర్భావం సమాజానికి దంభాచార రహితమైన ధార్మికత, నైష్యర్మ్యతత్త్వం, సంపూర్ణ శరణాగతి వీటి ప్రతిపాదనమే ప్రధాన లక్ష్యంగా జరిగింది. హరిదాసులు తమ కీర్తనలద్వారా దురాచారాలను తిరస్కరిస్తూ భగవంతునియందు నిష్కల్మషమైన భక్తితో జీవించడం ఎలాగో ప్రచారం చేశారు. సామాన్య జనుల ఎదుట నైతిక జీవనమంటే ఏమిటో వారు ప్రదర్శించి చూపారు. సరళమైన భాషలో భగవత్తత్త్వాన్ని ప్రజలకు తెలియపరిచారు. పరమాత్ముని కరుణ, సర్వవ్యాపకత, వైభవం, పారమ్యం ఇత్యాదులను వివరిస్తూ శరణాగతులకు భగవంతుని అభయహస్తం తప్పక దొరుకుతుందనే విశ్వాసాన్ని ప్రజలలో పాదుకొల్పారు.

వారు ప్రచారంచేస్తున్న కీర్తనలలోని భాషామాధుర్యం అన్ని వర్గాలవారిని సులభంగా ఆకర్షించగలిగింది. మహిళలు హరిదాసుల కీర్తనలలోని గేయఫణితికి విశేషంగా ఆకర్షితులయ్యారు. దైవనామాల్ని పాడుకోవడం, వాటిని తమ పూజావిధానంలో ఒక భాగంగా చేసుకోవడం పరిపాటిగా ప్రారంభమయింది. ఈ కీర్తనలు తరాల తరబడి నిలబడడానికి మహిళలే సింహభాగంలో నిలుస్తారనడంలో సందేహంలేదు.

హరిదాసులు సమాజంలోని కటువైన విషయాలను కళ్ళకు కట్టినట్టు జనుల ముందు పెట్టారు. వాటి కృతకత్వం, పొల్లుతనం, వంచనత్వంపట్ల ప్రజలను చైతన్యపరుస్తూ శుద్ధభక్తిని అవలంబించడంద్వారా పరిశుద్ధ సమాజ నిర్మాణం సాధ్యమని ప్రతిపాదించారు. ద్వైత సిద్ధాంత ఆదర్శాలను ప్రజలకు అర్థమయ్యే భాషలో జనప్రియంగ, ఆకర్షకంగ కీర్తించి వారి మనసులను చూరగొన్నారు. సామగాన ప్రియుడైన భగవంతుని స్వాధీన పరచుకోవడానికి సంగీత, సాహిత్యములే సాధనములని వారు వ్యాప్తిచేశారు. స్వయంగా భగవానుడే ‘‘యత్ర గాయంతి మద్భక్తాః - తత్ర తిష్ఠామ్యహం సదా’’ అన్నాడు. భగవద్భక్తుల గాథలివి. భక్తితో చదవండి.

- డా॥ బులుసు వేంకటసత్యనారాయణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Sriharidasulu