-
-
శ్రీచక్ర సంచారిణి
Srichakra Sancharini
Author: Sharada Polamraju
Publisher: J.V.Publications
Pages: 72Language: Telugu
శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయనివారు ఈ రోజుల్లో కనబడరు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా స్త్రీలు వయోభేదము లేకుండా చిన్న పెద్ద సామూహిక పారాయణాలు, లక్ష కుంకుమార్చనలు, లక్ష గాజుల అర్చనలు సర్వ సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. ఏ శుభకార్యమైనా పండుగలు పర్వదినాలలోనూ, శ్రావణాది పవిత్రమాసాలలో విధిగా స్తోత్ర పారాయణం చేయటం ఆనవాయితీగా వస్తోంది. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడ్డప్పటికీ ఈ సత్కార్యం విదేశాలలో కూడా పాటిస్తున్నారు అంటే గర్వపడవలసిన విషయమే.
ఈ విధంగా తరుచుగా పారాయణం చేస్తున్న ఒక బృందం సభ్యులని ప్రశ్నించటం జరిగింది. ఇంత దీక్షగా అమ్మవారి నామ పారాయణము చేస్తున్నారు కదా, అసలు లలితాదేవి ఎవరు? నామాలలో వచ్చేటటువంటి భండాసుర వధోద్యుక్త అంటారు, భండాసురుడు ఎవరు? అన్న ప్రశ్నలకు ఎవరి వద్ద నుండి కూడా సమాధానం లభించలేదు. కొందరు తెలుసుకొనే ఉత్సుకత ప్రదర్శించారు. కాని ఆ పురాణాలు చదివి తెలుసుకొనేటంత అవకాశం లభించక మిన్నకుండి పోయారు.
అటువంటి వారికి ఉపయుక్తంగా ఉంటుందన్న భావంతో ఈ సమాచారం సేకరించి వ్రాయటం జరిగింది.
నా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తాను.
- శారద పోలంరాజు
