-
-
శ్రీరామకృష్ణ కథామృతం
SriRamakrishna Kathamritam
Author: Mahendranath Gupta
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 1443Language: Telugu
ఇది “శ్రీరామకృష్ణ కథామృతం” రెండు సంపుటాలు కలిసిన ఈ-బుక్.
* * *
'మ' అనే పేరిట తమను గోప్యంగా ఉంచుకొన్న మహేంద్రనాథ్ గుప్త భగవాన్ శ్రీరామకృష్ణుల శిష్యుడు. జీవితంలో పలు ఎదురుదెబ్బలు తిన్న కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి తెగించిన స్థితిలో 'మ'కు శ్రీరామకృష్ణులను దర్శించుకునే భాగ్యం కలిగింది. ఆ సందర్శనం 'మ' జీవన గమనాన్నే మార్చివేసింది. అధోగతి అంచులకు వెళుతున్న తన జీవితాన్ని ఔన్నత్యం కేసి - ఆధ్యాత్మిక ఔన్నత్యం కేసి - మళ్ళించిన ఆ దివ్యపురుషుణ్ణి పదేపదే దర్శించాడు 'మ'. దర్శించుకోవడంతోనే ఆగిపోలేదు; ప్రతిరోజు కార్యక్రమాలను దినచర్య పుస్తకం (డైరీ)లో రాసి పదిలపరచారు. ఈ డైరీ నోట్స్ వివరణే ఈనాటి మతచరిత్రలో ఒక మైలురాయి గానూ, దుఃఖంలో మునిగివున్న అసంఖ్యాక హృదయాలలో ప్రశాంత అమృత ధారలను వర్షించే ఆనంద మేఘంగానూ, గృహస్థ జీవిత ఆదర్శాన్ని మన ముందు ఉంచి, దానిని చేరుకోవడానికి దారి చూపే మార్గదర్శిగానూ; సన్యాస జీవిత అసలైన ఆధారసూత్రాలను వివరించి, మార్గం చూపే ఉన్నతమైన గురువుగానూ భాసిస్తున్న శ్రీరామకృష్ణ కథామృతం.
శ్రీ రామకృష్ణుల సంభాషణల సంకలనాన్ని 'శ్రీ శ్రీ రామకృష్ణ కథామృత' అనే పేరుతో ఐదు సంపుటాలుగా వంగ భాషలో 'మ' ప్రచురించారు. దీని తెలుగు అనువాదం మొదటి సంపుటం 1976లో ప్రప్రథమంగా వెలువడింది. తదుపరి సంపుటాలు క్రమంగా, కాస్త జాప్యంతోనే వెలువడ్డాయి. ఐదవ సంపుటం 1985లో వెలువడింది.
గతంలోని ఐదు సంపుటాల స్థానే చెన్నై మఠం వారు మూడు సంపుటాలుగా వెలువరించారు. ప్రస్తుతం పాఠకులకు మరింత అనువుగా ఉండడానికి మూడు సంపుటాల స్థానే రెండు సంపుటాలుగా (పెద్ద పరిమాణంలో) ప్రచురిస్తున్నాం. బెంగాలీ గ్రంథంలో 'మ' ఉదహరించిన భగవద్గీతా శ్లోకాలనూ, పాఠకుల స్పష్టతను పెంపొందింపజేసే విధంగా 'పరిచ్ఛేదం' పేరుతో విభాగాలనూ చేర్చాం. లభ్యమైనంత వరకూ ఛాయాచిత్రాలను సముచిత స్థానంలో తిలకించడానికి వీలుగా పొందుపరిచాం. కొన్ని సంవత్సరాల క్రితం కొందరు పరిశోధకులు 'మ' దినచర్య పుస్తకంలోని నాలుగు ఆరోపాలు (entries) (25 ఆగష్ట్ 1886, 2 సెప్టెంబర్ 1886, 12 అక్టోబర్ 1886, 17 ఫిబ్రవరి 1887) నవ్యభారత్ అనే మాసపత్రికలో 1904లో ప్రచురితమైనట్లు కనుగొన్నారు. ఈ నాలుగు ఆరోపాలను మూడవ అనుబంధంగానూ, గ్రంథకర్తయైన 'మ' జీవిత చరిత్ర నాల్గవ అనుబంధంగానూ రెండవ సంపుటంలో పొందుపరిచాం.
- ప్రకాశకులు
గమనిక: “శ్రీరామకృష్ణ కథామృతం” ఈ-బుక్ సైజ్ 6.8 MB.

- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹108