• SriKrishnaMisriya DasaBhukthi Phala Nirnayam
  • fb
  • Share on Google+
  • Pin it!
 • శ్రీకృష్ణమిశ్రియ దశాభుక్తి ఫల నిర్ణయం

  SriKrishnaMisriya DasaBhukthi Phala Nirnayam

  Publisher: Mohan Publications

  Pages: 380
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

జన్మాంతరమందు పుణ్య పాప రూపకంబగు నెట్టి కర్మ సంపాదింపబడెనో దాని యనుభవ మీ జన్మమందు గలిగి యాఫలము దశాంతర్దశాదులవల్ల సమస్త జనులును తమ తమ జాతకములయందలి జననకాల గ్రహములయొక్క బలాబలముల కనుగుణముగా శుభాశుభఫలముల నెఱుంగవచ్చును. అట్లు తెలియుటయేగాక ఆ దశాదులవల్ల కలిగెడు యనిష్టములకు యధావిధిగా శాంతులు చేయుటవల్ల ననిష్ట పరిహారమై జాతకుడు అభీష్ఠసిద్ధిని, సుఖమును పొందును. కాబట్టి జన్మకాల ఘడియలనుబట్టి కాల సాధన లగ్న స్ఫుట సాధనలవల్ల గ్రహములను కనుగొని స్థానాధిషడ్బలములవల్లను, ఆధిపత్యస్థితి సాహచర్య, వీక్షణాదులవల్లను, మహాదశానాధునకును అంతర్ధశానాధునకు గల సంబంధా సంబంధ మూలకముగ గ్రహములకును కలిగెడు శుభా శుభత్వములను చక్కగా పరిశీలించి బలాబలములను, గుణదోషములను గణితమార్గములవల్ల గణన చేసి పిమ్మట వాని వాని శుభాశుభ ఫలములను చెప్పినట్లయిన స్ఫుటతరముగా నుండును.

అయినను ఫల భాగమునకు సంబంధించిన జ్యోతిష గ్రంథము లనేకములున్నను, పై చెప్పిన ప్రకారముగా ఫలములను క్రోఢీకరించి తెలిపెడి గ్రంథము లేనట్టి కొఱతను దీర్చుటకై అనేక ప్రాచీన జ్యోతిష గ్రంథముల యందలి ఫల భగాధ్యాయములలోని ముఖ్య సారాంశమును ఒకచోట చేర్చి సవిస్తరముగా సంస్కృతభాషలో వ్రాయబడియున్న ఈ జాతక గ్రంథమును ఆంధ్రీకరించియున్నాను. ఈ గ్రంథమును జ్యోతిషాభిమానులందరు తగు ప్రోత్సాహమిత్తరని ప్రార్థన.

- శ్రీవెల్లాల సీతారామయ్య

Preview download free pdf of this Telugu book is available at SriKrishnaMisriya DasaBhukthi Phala Nirnayam