• Sri Vishnu Mahapuranam Vachanam
  • Ebook Hide Help
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ విష్ణు మహాపురాణం (వచనం)

    Sri Vishnu Mahapuranam Vachanam

    Publisher: Victory Publishers

    Pages: 486
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పురాణ వాఙ్మయము పరమార్థ దృష్టి ప్రధానమైన భారతీయ ధర్మదృష్టికి ఆలంబనము. ఐహిక ఆముష్మిక సుఖాలలో, సంపన్నులుగాచేసే ధర్మాలను ప్రతిపాదించటంలో శ్రుతు (వేదము)లతో బాటు పురాణాలకు ప్రామాణ్యం ఉన్నది. బదరికారణ్యంలో గల ప్రాచీన విద్యాపీఠానికి కులపతి అయిన వేదవ్యాసుడు అష్టాదశ మహాపురాణాలను, ఉపపురాణాలను శిష్యులకు బోధించాడు. ఆ అష్టాదశ పురాణాలలోను శ్రీ విష్ణుమహాపురాణం మూడవది. పురాణపురుషుని యొక్క కుడిభుజంతో పోల్చబడింది ఈ పురాణం. విష్ణుపురాణం ప్రసక్తి యజుర్వేదంలో కనిపిస్తున్నది. అంటే వేదకాలంనాటికే ఈ పురాణం వర్థిల్లింది అని భావించవచ్చు.

శ్రీ విష్ణు మహాపురాణం ఆరు అంశాల(విభాగాల)తో ఆరువేల నాలుగువందల పన్నెండు శ్లోకాలలో చెప్పబడిన, విష్ణుమహత్మ్య ప్రతిపాదకమైన విశిష్టపురాణం. శ్రీ విష్ణు ప్రాథమ్యాన్ని, విష్ణుభక్తి స్వరూప వైవిధ్యాన్ని, దాని వైశిష్ట్యాన్ని ప్రతిపాదించేది ఈ పురాణం. త్రిమత ప్రస్థాన ఆచార్యులు శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీమదానంద తీర్థులు తమ తమ భాష్యాది రచనలలో ఈ పురాణాన్ని ప్రామాణికంగా గ్రహించటమే దీని ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని తెలుపుతుంది. ఇంతే కాకుండా ఎన్నో స్మృతి గ్రంథాలలోను, వ్యాఖ్యా గ్రంథాలలోను ఈ పురాణంలోని శ్లోకాలు ప్రామాణికంగా ఉదహరించబడ్డాయి.

ప్రకృతి, పురుషుడు మొదలైన 24 తత్త్వాలు, జగదుత్పత్తి, కాలస్వరూపం, వివిధ అవతారాలు, నగరం, గ్రామం మొదలైన పేర్లతో భూమి విభజన, ధృవుని వృత్తాంతం, హిరణ్యాక్షవధ మొదలైన వృత్తాంతాలే గాక పురాణపంచ లక్షణాలు దీనిలో సమ్యగ్రూపంలో వర్ణించబడ్డాయి. అయిదవ అంశంలో శ్రీకృష్ణావతార చరిత్ర చాలా హృదయంగమంగా చెప్పబడింది.

మహాభారతంలో భగవద్గీతను, ధర్మశాస్త్రాలలో మనుస్మృతిని, వేదాల్లో పురుణ సూక్తాన్నీ, పురాణాల్లో విష్ణుపురాణాన్ని పండితులు ఎంతో ఆరాధిస్తారు. అలాంటి మహాత్మ్యం గల విష్ణుపురాణం ప్రతి తెలుగు వారి గృహాలను అలంకరించాలని మా కోరిక. పఠితలు దీనిని ఇంతకు ముందు మేము ప్రచురించిన పురాణాలవలెనే ఆదరించాలని మా ప్రార్థన.

Preview download free pdf of this Telugu book is available at Sri Vishnu Mahapuranam Vachanam