-
-
శ్రీ వాయు మహాపురాణం
Sri Vayu Mahapuranam
Author: Avancha Satyanarayana
Publisher: Victory Publishers
Pages: 824Language: Telugu
చారిత్రక దృష్టితో చూస్తే, అన్ని పురాణాలలోకి ప్రాచీనమైన పురాణం వాయు పురాణం. మహాకవి బాణభట్టు తన కాదంబరి గద్యకావ్యంలో 'పురాణేవాయు ప్రలపితమ్' అని దీనిని పేర్కొన్నాడు. అందువలన దీని రచనము బాణభట్టు కంటే చాలా పూర్వమే జరిగి ఉండాలని చెప్పవచ్చు.
మిగిలిన పురాణాలతో పోలిస్తే ఇది పరిమాణంలో చిన్నదే. ఈ పురాణం నాలుగు పాదాలుగా విభజించబడింది. మొదటిదైన ప్రక్రియా పాదంలో 1 - 6 అధ్యాయాలు, రెండవదైన ఉపోద్ఘాత పాదంలో 7-64 అధ్యాయాలు, మూడవదైన అనుషంగ పాదంలో 65-99 అధ్యాయాలు, నాల్గవదైన ఉపసంహార పాదంలో 100-112 అధ్యాయాలు వెరసి 112 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలోని శ్లోకాల సంఖ్య దాదాపు పదకొండు వేలు.
మొదటి పాదంలో సృష్టి క్రమాన్ని గురించి, చతురాశ్రమ విధానాల గురించి వివరణ ఉన్నది. ప్రాచీన భౌగోళిక విషయాల అధ్యయనం కోసం ఈ పురాణం చాలా ఉపయోగకరమైన గ్రంథం. ఈ పురాణంలో జంబూద్వీప వర్ణన, ఇతర ద్వీపాల వర్ణన చక్కని శైలిలో వివరించబడింది. ఖగోళ వర్ణన కూడా ఈ పురాణంలో విస్తృతంగా చేయబడింది. అనేక అధ్యాయాలలో యుగ, యజ్ఞ, ఋషి, తీర్థ వర్ణనలు విస్తృతంగా లభ్యం అవుతున్నాయి.
నాలుగు వేదాలలోని వివిధ శాఖల వివరణ, శ్రాద్ధ వర్ణన, సంగీత విషయాల గురించిన ప్రత్యేక వివరాలు, ప్రాచీన రాజుల చరిత్రలు ఈ పురాణంలో వివరించబడ్డాయి.

- ₹60
- ₹60
- ₹60
- ₹648
- ₹1080
- ₹324