• Sri Vasishta Rama Samvadamu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • శ్రీ వసిష్ఠ - రామ సంవాదము

  Sri Vasishta Rama Samvadamu

  Pages: 3021
  Language: Telugu
  Rating
  4.67 Star Rating: Recommended
  4.67 Star Rating: Recommended
  4.67 Star Rating: Recommended
  4.67 Star Rating: Recommended
  4.67 Star Rating: Recommended
  '4.67/5' From 6 votes.
  4.60 Star Rating: Recommended
  4.60 Star Rating: Recommended
  4.60 Star Rating: Recommended
  4.60 Star Rating: Recommended
  4.60 Star Rating: Recommended
  '4.60/5' From 5 premium votes.
Description

శ్రీ వసిష్ఠ - రామ సంవాదము

(శ్రీవాల్మీకి మహర్షి ప్రణీత యోగవాసిష్ఠము)

ఆర్షధర్మ వాఙ్ఞయ వినీలాకాశంలో జాజ్వల్యమానంగా భాసిస్తున్న తారలెన్నో. ఆ తారా సమూహంలో విశిష్టంగా భాసిస్తూ ధ్రువతార అని పరిగణించదగినది శ్రీ యోగవాసిష్ఠము. వాసిష్ఠ రామాయణము, మహారామాయణము, ఆఖండ రామాయణము అని కూడ గణుతికెక్కిన ఈ గ్రంథం వాల్మీకి మహర్షిచే విరచితమైనది. ముప్పైరెండు వేల శ్లోకాలతో ఒప్పారే ఈ బృహద్గ్రంథంలో వైరాగ్య-ముముక్షువ్యవహార-ఉత్పత్తి-స్థితి-ఉపశమ-నిర్వాణ అనే ఆరు ప్రకరణాలు ఉన్నాయి. వసిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చేసిన అద్వైత వేదాంత బోధ ఇందలి విషయం.

ఆర్యుల తత్త్వ చింతనాసక్తి, తత్త్వవిశ్లేషణా శక్తి, బుద్ధి కుశలతా, ధీశక్తి వైభవానికి ఈ గ్రంథం అద్దంపడుతుంది. గ్రంథంలోని విషయమంతా ఇద్దరు జ్ఞానుల మధ్య జరిగిన సంభాషణ. ఇప్పటి వరకూ హైందవ జాతికి తమ పూర్వీకుల నుంచి లభించిన ఆధ్యాత్మిక వారసత్వంలో అత్యంత విలువైనది, గొప్పగా ఎంచదగ్గది ఈ గ్రంథం అంటే అతిశయోక్తి కాదేమో!

ఈ కావ్యాన్ని శ్లోకాలూ, తాత్పర్యంతో సహా మొదట తెలుగులో ప్రచురించినది శ్రీ వ్యాసాశ్రమం, ఏర్పేడు వారు. బ్రహ్మలీన పూజ్య మలయాళ స్వామీజీ వారు, రామకృష్ణ మఠం స్వామీజీ శ్రీ నిర్వికల్పానంద వారిని ప్రోత్సహించి సగభాగానికి (సుమారు 15 వేల శ్లోకాలకు) తాత్పర్యాన్ని వ్రాయించారు. మిగతా సగభాగానికి వారి శిష్యులు బ్రహ్మలీన శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వామీజీ వారు తాత్పర్యాన్ని సమకూర్చారు. 1936వ సంవత్సరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 18 సంవత్సరాల శ్రమ తర్వాత 1954లో పుస్తకాన్ని ప్రచురించారు. ఈ వరిషస గ్రంథాన్ని తెలుగులో సరళ తాత్పర్యంతో అందించిన శ్రీ వ్యాసాశ్రమం వారికి తెలుగు ప్రజలు సర్వదా కృతజ్ఞులై ఉండాలి. శ్రీ నిర్వికల్పానంద, శ్రీ విద్యాప్రకాశానంద గిరి యతివరేణ్యులకు కూడ మనం కృతజ్ఞతా బద్ధులమై ఉండాలి.

పంతొమ్మిది వందల యాభయ్యవ దశకం తెలుగు భాషకు, ప్రస్తుత తెలుగు భాషకు తేడా ఉన్నది. శ్రీ వ్యాసాశ్రమం వారి పుస్తకంలోని తాత్పర్యాన్ని సరళీకృతం చేసి అందులోని సుదీర్ఘ సంభాషణల నిడివి తగ్గించి, ఆధునిక పాఠకుడు సునాయాసంగా అర్థంచేసుకోవటానికి వీలుగా సంస్కృత శ్లోకాలను అక్కడక్కడ మాత్రమే ఉటంకిస్తూ వచన కావ్యంగా తీర్చిదిద్దిన వారు శ్రీ హనుమ రామకృష్ణ గారు. వసిష్ఠ రామ సంవాదాలలో వసిష్ఠులవారి సమాధానం సుదీర్ఘంగా ఉన్నచోట శ్రీరాముడిచే ఇతర ప్రశ్నలను సంధింపజేసి సంవాదాలను చిన్నవిగా చేసి తేలికగా విషయాన్ని గ్రహించటానికి దోహదపడేలా వీరు పుస్తకాన్ని వెలువరించారు. అమూల్యమైన ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలన్న వారి సత్సంకల్పానికి మా వంతు సహాయంగా పుస్తకాన్ని మఠం స్వయంగా ప్రచురించింది.

శ్రీ వసిష్ఠ - రామ సంవాదము అనే ఈ ఈపుస్తకం నాలుగు సంపుటాల సంకలనం. మొదటి సంపుటంలో - వైరాగ్య, ముముక్షు వ్యవహార, ఉత్పత్తి ప్రకరణములు; రెండవ సంపుటంలో స్థితి, ఉపశమన ప్రకరణములు; మూడవ నాల్గవ సంపుటాలలో నిర్వాణ ప్రకరణము ఉన్నాయి.

- ప్రకాశకులు


"శ్రీ వసిష్ఠ - రామ సంవాదము" ఈబుక్ సైజు 13.5 mb

Preview download free pdf of this Telugu book is available at Sri Vasishta Rama Samvadamu
Comment(s) ...

Thank you very much for sending the books all the way from Hyderebad to Bangalore. I was afraid whether I receive the books in a proper condition. The packing was exceptional and received the books in a good condition and within 3 days of ordering the books