-
-
శ్రీ వరాహ మహాపురాణం
Sri Varaha Maha Puranam
Author: Avancha Satyanarayana
Publisher: Victory Publishers
Pages: 660Language: Telugu
భారతీయ వాజ్మయంలో పురాణాలు అత్యంత విశిష్టమైనవి. అవి లోకానికి మిత్రులవలె హితాన్ని ఉపదేశిస్తాయి. కాబట్టి "మిత్రసమ్మితములు" గా ప్రఖ్యాతి వహించాయి. పురాణాలు ప్రాచీనమైనవైనా ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అవి మన పురాతన విజ్ఞాన సర్వస్వాలు (Encyclopaedias). అటువంటి పదునెనిమిది పురాణాల్లో అగ్రగణ్యమైనది "శ్రీ వరాహ మహాపురాణం".
శ్రీ మహావిష్ణువు వరాహ రూపమును ధరించి పాతాళ లోకము నుంచి భూమిని ఉద్దరించిన వృత్తాంతము ముఖ్య సంబంధము కలది, అయినందున ఈ పురాణమునకు వరాహపురాణము అనే పేరు వచ్చింది.
వరాహ పురాణానికి సౌకర పురాణం అని, ఆదివరాహ పురాణం అని పేర్లు కూడా ఉన్నాయి. శ్రీ మహావిష్ణు అవతారపు పేర్లతో ఉన్న మత్స్య, కూర్మ, వరాహ, వామన పురాణాలలో ఇది మూడవది. పురాణపురుషుడగు శ్రీ మహా విష్ణువు యొక్క 'ఎడమ చీలమండలం'గా ఈ పురాణం తెలుపబడినది. అష్టాదశ పురాణాలలో ఇది పన్నెండవ పురాణంగా తనను తానే "వరాహం ద్వాదశం ప్రోక్తమ్" అని చెప్పుకొనుచున్నది.
భగవంతుడు శ్రీ మహావిష్ణువు మహా సముద్రంలో మునిగిపోతున్న భూమిని వరాహరూపంలో అవతరించి ఉద్ధరించాడనే తైత్తిరీయ శతపథ బ్రాహ్మణాలలోను, అనేక పురాణాలలోను ఉదహరింపబడింది. ఆ వరాహ రూప విష్ణువే భూదేవికి ఈ పురాణాన్ని వివరించాడనీ తెలుపబడింది.
ప్రస్తుత వరాహపురాణంలో 9,564 శ్లోకాలు మాత్రమే ఉన్నవి. ఇందులో వివిధ అధ్యాయాల్లో వచన రూపంలో భాగాలను కూడా కలుపుకుంటే ఇందులోని శ్లోకాలు 10,000 వరకూ ఉంటాయి. కాని కొన్ని పురాణాలు 24,000 శ్లోకాలు ఉన్నాయని తెలియజేస్తున్నాయి.
ఈ పురాణంలో విష్ణు సంబంధమైన అనేక వ్రతాలు- వాని మాహాత్యము, వివరణ కూడా లభ్యమవుతున్నది. అనేక స్తోత్రాలు కలిగిన పురాణం ఇది. మొత్తమ్మీద వరాహపురాణం విష్ణు పారమ్యతను ప్రతిపాదిస్తూ వ్రత తీర్థములు వివరణలు గల పురాణం అని చెప్పవచ్చును.
ఇప్పటి వరకూ విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు తమ పురాణ భారతి సిరీస్లో ప్రకటించిన పురాణాలలో ఇది పదమూడవది. అంతకుముందు ప్రచురించిన పురాణముల వలెనే తెలుగు పురాణ ప్రేమికులు ఈ పురాణాన్ని కూడా ఆదరిస్తారని మా ఆకాంక్ష.
- ₹60
- ₹60
- ₹648
- ₹60
- ₹1080
- ₹324
Can you provide more info, does it have telugu commentary or is it just Slokas?