-
-
శ్రీ ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన
Sri Uchchista Ganapati Upasana
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 112Language: Telugu
Description
కలియుగంలో ప్రత్యక్ష ఫలితాలనిచ్చే దేవుళ్ళలో గణపతి ముఖ్యమైనవాడు. గణపతి ఉపాసనల్లో చాలా ప్రత్యేకమైనది, ఎంతో వైవిధ్యమైనది ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన.
ఉచ్ఛిష్ట గణపతి అనే ఈ గ్రంథంలో మంత్ర మహార్ణవాది తంత్ర గ్రంథాలలో చెప్పబడ్డ శ్రీ ఉచ్ఛిష్ట గణపతి ఉపాసనా మంత్రాలతో పాటు, శ్రీ ఉచ్ఛిష్ట గణపతి సహస్రనామ స్తోత్రాన్ని, కవచ స్తోత్రాన్ని కూడా అందించాము. అలాగే ఉపాసనకి ముందుగా శ్రీ ఉచ్ఛిష్ట గణపతి షోడషోపచార పూజని ఇచ్చాము. స్వామి వారిని ముందుగా పూజించి, ఆ తరువాత మంత్రజపం చేస్తే మంచిది.
ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన శీఘ్రంగా ఫలిస్తుంది. గురుముఖతః మంత్రదీక్ష తీసుకుని ఉపాసిస్తే సత్ఫలితాలు లభిస్తాయి. ఈ ఉపాసనలో భాగంగా చెప్పిన విధానాలని (అనగా తాంబూలాం లేదా ఉండ్రాళ్ళు నములుతూ అనేవి) వామాచారంగా భావించకూడదు. శ్రీ ఉచ్ఛిష్ట గణపతి మంత్రాన్ని ఉపాసించాలనుకునేవారు, ఈ గ్రంథంలో తెలిపిన నియమాలను పాటిస్తూ స్వామిని ఉపాసించినట్లయితే ఆయన దివ్యానుగ్రహం తప్పక కలుగుతుంది.
నమస్కారాలతో....
- డా. జయంతి చక్రవర్తి
Preview download free pdf of this Telugu book is available at Sri Uchchista Ganapati Upasana
Login to add a comment
Subscribe to latest comments

- ₹64.8
- ₹72
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72