-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం (free)
Sri Subrahmanya Vratam - free
Author: Viswapathi
Publisher: Shri Designs
Pages: 24Language: Telugu
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు జ్ఞాన ప్రదాత. తనను నమ్మి కొలచినవారిని ఈ స్వామి నిత్యం కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఆ స్వామి కొలువై వున్న దివ్యక్షేత్రాలలో తమిళనాడులోని ఆరు క్షేత్రాలు ఎంతో మహిమాన్వితమైనవి. అవే పళని, తిరుత్తణి, తిరుచందూరు, పళముదిర్చోళై, తిరుప్పారకుండ్రం మరియు స్వామి మలై, ఈ ఆరు క్షేత్రాలలో కార్తికేయుని దర్శించినవారికి ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి. సర్వసౌభాగ్యాలు లభిస్తాయి.
ఈ సుబ్రహ్మణ్య వ్రతం పూర్తిగా ఆ స్వామి అనుగ్రహంతోనే రచింపబడింది. ఇది ఆచరించటం చాలా తేలిక. ఈ వ్రతం ఆచరించినవారికి ఆ కార్తికేయుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. ఏమైనా గ్రహబాధలతో బాధ పడుతున్నవారు ఈ వ్రతం ఆచరిస్తే వెంటనే ఆ బాధలనుండి విముక్తులవుతారు. సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. సంతానం కావలసినవారికి ఈ వ్రతానికి మించిన ఉపాయం మరొకటి లేదు. ఆర్థిక బాధలతో సతమతమవుతున్నవారు ఈ వ్రతం ఆచరిస్తే వెంటనే ఆ సమస్యలనుండి బయటపడతారు.
- తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి
