• Sri Srisaila Mallikarjuna Padya Trisati
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ శ్రీశైల మల్లికార్జున పద్య త్రిశతి

    Sri Srisaila Mallikarjuna Padya Trisati

    Publisher: Mushti Srinivas

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''శ్రీశైలం శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే'' అనే స్కాంద పురాణ వచనము, యీ "శ్రీ శ్రీశైల మల్లికార్జున పద్య త్రిశతి"కి కూడా వర్తిస్తుంది. శ్రీశైల శిఖరాన్ని చూచిన వారి వలనే, యీ త్రిశతిని విన్న వారికి, చదివిన వారికి, పునర్జన్మ వుండదు. అంత తన్మయత్వములో లీనమై, లింగార్చన చేసి, ఉప్పులూరి వారు జీవితములో ధన్యమైనారు.

ఉత్పలమాల, చంపకమాల, మత్తేభము, శార్దూలము, మత్తకోకిల వంటి మార్గ ఛందస్సులు, సీసము వంటి దేశీచ్ఛందస్సులను, అలవోకగా నడిపి, ఉప్పులూరి వారు యీశ్వరార్చన కళా శీలురు అయినారు. శ్రీశైల క్షేత్ర విశేషాలను యెన్నింటినో, కళ్ళకు కట్టినట్లు వర్ణించి, పాఠకుల మనోనేత్రములో, శ్రీశైల దర్శన భాగ్యాన్ని కలిగించారు.

ఈ పద్యాలలో, శ్రీశైల క్షేత్ర మహత్మ్యాన్ని, ప్రాధాన్యాన్ని, ప్రాముఖ్యాన్ని, సాధారణ పాఠకులకు కూడా, అరటిపండు వొలిచి పెట్టినట్లు, అందించారు.

- డా. పాలపర్తి శ్యామలానందపస్రాద్‌

* * *

శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారి శ్రీ శ్రీశైల మల్లికార్జున త్రిశతి పద్య శతకము, ఆ మల్లికార్జున స్వామి దయచే, ఆశువుగ సాగిన మహోన్నత, భక్తిరస, ప్రధాన ఆధ్యాత్మిక శతక గ్రంధ రాజము. ప్రతి పద్యము భావ యుక్తముగా మల్లికార్జునస్వామి ప్రతిభలను చాటినవి.

శ్రీశైల క్షేత్ర మహిమ, శ్రీశైల క్షేత్ర భక్తి పారవశ్యములు, క్షేత్రమునకు నాలుగు ప్రక్కల వున్న అడవులు, సెలయేరులు, కొలనులు, ఆలయములు, దేవతామూర్తుల, ఆమూలాగ్ర మహత్తర దివ్య, వైభవ భక్తి ప్రపత్తుల విశేషములు, కొండలు, కోనలు, వృక్షరాజముల ప్రకృతి రామణీయకతలు, తీర్ధ రాజముల మహత్తర పుణ్య విశేషములు, పాతాళగంగ తీర్ధజల పవిత్రతలు, క్షేత్రములో జరుగు సేవలు, మహత్తర భోగములు, రసవత్తర పుణ్య విశేషములు, మహాశివరాత్రి మహా విశేషములు, శివదీక్షా విశేషములు, మహాఋషుల, మునుల తపో ప్రాభవములు, అన్నదాన సత్రములు, శ్రీశైల మల్లికార్జున మహనీయ పురాణ, వేద గాధలు, వివిధ ఉత్సవ ప్రాశస్త్యములు, భక్తాగ్రేసరుల రసవత్తర భక్తి మయ పుణ్య జీవిత గాధలు, ఇంకా అనేకానేక భక్తి ప్రపత్తి, వివిధ రసరీతులు మనోజ్ఞముగా, కన్నులకు కట్టినట్లుగా అత్యంత శోభాయమానంగా, రసజ్ఞులైన భక్తులకు అత్యంత ఆకర్షణీయముగా రచయిత రచన జేయటం, ఆ శ్రీ శ్రీశైల మల్లికార్జుని అఖండ దీవెనల పుణ్య ఫలితమే. శ్రీ కాశీ విశ్వనాధుని అపూర్వ పుణ్య ఆశీర్వచనల ఫలితమే యీ శతక వుద్భవమునకు ప్రేరణ.

- శ్రీ వి.వి. సుందరశాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Sri Srisaila Mallikarjuna Padya Trisati