-
-
శ్రీ శివ మహా పురాణము
Sri Shiva Maha Puranamu
Author: Viswanatham Satyanarayana Murthy
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 648Language: Telugu
వేదములే మూలములుగా గల అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఆ వేదములు చతుర్ముఖ బ్రహ్మకు పరమశివుడే ఉపదేశించాడు. కనుక వేదములు, వాటి నుండి వెలువడిన శ్రుతి, స్మృతులు, పురాణాలు అన్ని ప్రప్రథమంగా శివుని చేత బ్రహ్మదేవునికి తెలుపబడింది. కాబట్టి మహాశివుడే మొట్టమొదటి పురాణ కథానాయకుడని మహాభారతం శాంతిపర్వంలో – “అష్టాదశ పురాణానాం దశభిః కథ్యతే శివః” - అని పేర్కొనబడింది. అష్టాదశ పురాణాలలో పది పురాణాలు శివుని కథలతో నిండినవని స్పష్టంగా తెలియబడుచున్నది. సర్వవ్యాపకుడు,సర్వాధారుడు, నిర్వికారుడు, నిరంజనుడు అని బ్రహ్మ విష్ణ్వాది దేవతల చేత కీర్తించదగ్గ మహాశివుని లీలా మాహాత్మ్యాన్ని తెలిపేదే ఈ శివ మహా పురాణం. ఈ శివ మహా పురాణం మహా పుణ్యప్రదాలైన పన్నెండు సంహితలను కలిగి ఉంది. లక్ష శ్లోకాలతో కూడినది. అయితే కలియుగ జీవులు అల్పాయుష్కులని గ్రహించి వ్యాసమహర్షి ఏడు సంహితలు, ఇరువది నాలుగు వేల శ్లోకాలలో సంక్షిప్తం గావించారు. ఈ శివ మహా పురాణం అష్టాదశ పురాణాలలో నాల్గవది. ఏడు సంహితలలో నాల్గవదైన కోటి రుద్ర సంహితలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రాదుర్భావ చరిత్ర పొందుపరచబడింది.
పురాణాలలో సాగే సంభాషణలలో ఆధ్యాత్మిక సాధకుల సాధనా మార్గాలు తేటతెల్లమవుతాయి. ఉదాహరణకు శివ మహా పురాణం రుద్ర సంహితలో దాక్షాయణి పరమశివుని సమీపించి నివృత్తి మార్గాన్ని ఉపదేశించమని కోరింది. జీవుడు ఏ తత్త్వాన్ని ఎరిగి సంసార దుఃఖాన్ని దాటగల్గుతాడో ఆ మోక్షసాధనను తెలియజేయమని కోరింది. పరమశివుడు భక్తిమార్గాన్ని బోధించి ముల్లోకాలలో భక్తి కంటె సులభమైన మార్గం లేదని వివరించాడు. ఈ పురాణంలో ప్రతీ ఘట్టం జీవులకు మేలైన సాధనా మార్గాన్ని ప్రతిపాదిస్తుంది.
“పఠనాచ్ఛ్ర శ్రవయా దస్య భక్తి మా న్నర సత్తమః, సద్యః శివపదప్రాప్తిం లభతే సర్వసాధనాత్” - భక్తితో శివపురాణం పఠించే మానవులూ, ఆ పురాణమును భక్తిశ్రద్ధలతో ఆలకించేవారూ, శివుని భక్తి ప్రపత్తులతో ఆరాధించే నరులు, మానవోత్తములై ఇహ లోకంనందు సుఖసౌఖ్యాలను, పరలోకమునందు శివసాన్నిధ్యాన్ని పొందగలరని ఈ పురాణమే చెబుతోంది. మఠం ద్వారా ప్రథమంగా వెలువడుతున్న ఈ శివ మహా పురాణాన్ని తెలుగు పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ...
- ప్రకాశకులు
గమనిక: "శ్రీ శివ మహా పురాణము" ఈబుక్ సైజ్ 18.6 MB
- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹108
excellent
I had some problem initially. but kinigie resolved it. thanks