-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
శ్రీ సీతారామ కల్యాణము - పద్యానువాదము (free)
Sri Seetarama Kalyanamu Padyanuvadamu - free
Author: Kota Rajashekhar
Publisher: Sankarabharanam Prachuranalu
Pages: 448Language: Telugu
శ్రీరామచంద్రుడు జగత్ప్రభువు. దయాసముద్రుడు. మర్యాదాపురుషోత్తముడు. తన ఆచరణ ద్వారా ప్రపంచమునకు ధర్మమును మానవత్వమును బోధించినవాడు. తన అడుగుజాడలలో నడుచుటకు ప్రజలకు అనువైన మార్గమును ఏర్పఱచిన ధర్మమూర్తి. తల్లిదండ్రులు గురువులు అన్నదమ్ములు బంధువులు అనుచరులు మొదలగువారి యెడల, రాజ్యపరిపాలనము నందు తన కర్తవ్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవాడు. భృత్యులయెడల, తనను శరణు కోరి ఆశ్రయించినవారియెడల, ఎలా ఉండవలయునో ఆచరించి చూపించిన ఆదర్శమూర్తి. మానవుడుగా అవతరించి మహోన్నత వ్యక్తిత్వముతో ఈ భూమిపై సంచరించిన ఆ శ్రీరామచంద్రుని బాల్యవిశేషములను పద్యకావ్యముగా వ్రాయుటలో కాలమును సద్వినియోగ పఱచిన కోట రాజశేఖర్ గారు ధన్యాత్ములు.
ఈ సీతారామకల్యాణ గ్రంథమునందు శ్రీవాల్మీకి ప్రణీతమైన మూలశ్లోకములను తనకు అవసరమైనంత మేర పొందుపఱచి తాత్పర్యమును అందించి తెలుగు పద్యములుగా ఎంతో సుందరముగ అనువదించి ఇందు ఇమిడిపోయేటట్లు చేసినారు. ప్రతిపద్యము హృద్యమే. ప్రతి పలుకు రమ్యమే. చక్కని అనువాదము కావున దీనికి మరల వ్యాఖ్యానము అవసరములేదు. అలతి అలతి పదాలతో, అందమైన అద్భుతమైన భావాలతో అల్లిన రమణీయమైన కవిత్వము రాజశేఖర్ గారిది అనడం వాస్తవం.
చెఱకు ఎక్కడి నుండి తిన్నా తీయగానే ఉంటుంది. అలాగే శ్రీరాముని గాథ ఎక్కడినుండి చదవడం ప్రారంభించినా అది అమృతమే. శ్రీరామ సాగరములో మునకలు వేస్తే ఎన్నో రత్నాలు, మణులు, మాణిక్యాలు దొరుకుతాయి. ఈ శ్రీరామాయణ మహాసాగరములో మానవాళి జీవన స్రవంతికి కావలసిన రత్నములు కోకొల్లలుగా ఉన్నవి.
- శ్రీశ్రీశ్రీ శ్రీహరితీర్థ స్వాములవారు
గమనిక: " శ్రీ సీతారామ కల్యాణము - పద్యానువాదము " ఈబుక్ సైజు 7.9mb
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE