-
-
శ్రీ సత్యసాయి ప్రబోధామృతము
Sri Satya Sai Prabodhamruthamu
Author: Tumuluru Krishna Murty
Publisher: Self Published on Kinige
Pages: 1234Language: Telugu
శ్రీసత్యసాయి ప్రబోధామృతము ఒక అమూల్యమైన గ్రంథరాజము, భగవాన్ బాబావారు అపార జ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞాన ప్రజ్ఞాన ప్రబోధకులు, ప్రసారకులు, ఆవిజ్ఞానాంబుధిని మథించి అందులోని రత్నాలను, అకారాదిఅక్షర క్రమంగా విషయీకరణచేసి, ఆ విషయాలకు సంబంధించినస్వామి యొక్క వచన కాంతిరేఖలను కూర్చి, పేర్చి, అమర్చి పాఠకులకు సులభంగా అందుబాటులో యుండునట్లు తీర్చి దిద్దిన సంకలనకర్తలకు ఎన్నో ధన్యవాదములు.
ఈ సంకలనయజ్ఞంలో, బాబావారి వాక్యామృతమున్న శతాధికగ్రంథములను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగినది. ఇవన్నీ కలిపితే వేలకు వేలపుటలగును! ఎన్నో ఏళ్ల క్రితం నుంచి ప్రచురణ అయిన సాయి గ్రంథములను సాయి వాక్య విభూతులను పట్టుదలతో సేకరించి, సమీకరించి, సమన్వయపరచి అందులోని నిగ్గును, అరటి పండునువొలిచి అరచేతిలోపెట్టినట్లు, మన కందించిన సంకలనకర్త దంపతులకు మనమెంతో ఋణపడియున్నాము.
ఇంకొక ముఖ్యవిషయం: ఇదొక ప్రామాణికగ్రంథం: ప్రతి వాక్యసముదాయానికి అడుగున దాని మూలకం, పుటలతో సహా ఉటంకరించబడినది. ఇది ఈ గ్రంథవిశిష్టత.
ఈవిధంగా పాఠక జిజ్ఞాసువులకు సులభోపయోగంగా అమృతతుల్యమైన ఈ పుస్తకాన్ని సంకలనకర్తలు మలచినారు. అందుచే ఈ బృహత్ గ్రంథం, సాయి విజ్ఞానసారాన్ని సాధకులకు, భక్తులకు పరిశోధకులకు, విద్యార్థులకు, వక్తలకు పంచి, వారికి ఎంతో సహాయపడుననుటలో ఏ విధమైన అతిశయోక్తి లేదు.
ఈ సంకలన కర్తల భక్తి తాత్పర్యములవల్లనూ, వారి శ్రద్ధా, నైపుణ్యములవలననూ ఇట్టి గ్రంథరాజము మనమాతృభాషలో మనకు లభ్యమగుచున్నది: అందుకు వారికి మన కృతజ్ఞతలు.
ఇది శ్రీ సత్యసాయి ప్రత్యక్షవచనాత్మక ఆధ్యాత్మిక సాధనాగ్రంథము కదా! అందుచే భగవాన్ శ్రీసత్యసాయి బాబావారు ఈ సంకలనకర్త లిద్దరకు ఆయురారోగ్యములను ప్రసాదించుగాక! అని ప్రార్థిస్తూయున్న:
- ఘండికోట వెంకట సుబ్బారావు , (విశ్రాంత) ఐక్యరాజ్యసమితి ఇంధనశాఖాధిపతి
