-
-
శ్రీ సర్ప (నాగ) తంత్రం
Sri Sarpa Tantram
Author: Swami Madhusudana Saraswati
Publisher: Mohan Publications
Pages: 318Language: Telugu
భారతదేశము అత్యంత పవిత్రమైన విశిష్టమైన సనాతనమైన సంస్కృతికి, ధర్మమునకు, పలు ఆరాధనలకు నిలయము. ప్రకృతిలోని పర్వతాద్యచేతనములలో కూడ దైవాంశను దర్శించి కొలిచిన భారతీయులు పలురీతులలో ప్రత్యేకతలను కల నాగములను ఆరాధించుటలో వింత ఏమియును లేదు. కాని Ferguson వంటి పాశ్చాత్య విమర్శకులు కొందఱు నాగారాధన ప్రాచీనార్య సంస్కృతికి చెందినది కాదని, ప్రాయశ: అది ద్రావిడ సంస్కృతి ప్రభావము వలన ఆర్య సంస్కృతిలో ప్రవేశించి యుండునని వాదించుచు, అందులకు ప్రోద్బలకముగా ఆర్య సాహిత్యములో మిక్కిలి ప్రాచీనముగా భావింపబడు ఋగ్వేదములో ఎచటను నాగారాధన ప్రసక్తి లేకుండుటను పేర్కొనిరి. ఈ వాదము ఎంత మాత్రము పసలేదని J. Ph. Vogel వంటి విదేశీయ పండితులు సహేతుకముగా నిరాకరించుచు, అందులకు ప్రముఖ నాగవిశేష బోధకములైన నామపదములన్నియు ఆర్యభాషా మూలకములగుట వంటి పలు నిదర్శనములను చూపిరి. Vogel పండితుడు “Indian Serpent” అను గొప్ప ఆంగ్ల గ్రంథములో ఈ విషయమును ప్రస్తావించుచు “In this connection it may be noted that the mystic snake – kings bear personal names which almost invariably are not Dravidian, but purely Aryan” – అని విశ్లేషించుట గమనార్హము. ఈ నాగారాధన భారతమున సర్వత్ర విస్తరించుటయే కాక ఇండోనేషియా, చైనా, జపాన్, శ్రీలంక, బర్మా వంటి ఇరుగుపొరుగు దేశములందును వ్యాపించినది. ఇందులకు భారతీయ సంస్కృతి ప్రభావమే కారణమని తలచు విమర్శకులును పలువురు కలరు. ఈ నాగారాధన ప్రభావము కేవలము వైదిక సంప్రదాయమునందే కాక, బౌద్ధ సంప్రదాయమున, తన్మత గ్రంథములలో జాతక కథలలో విస్తృతముగా కలదు. భారతములోని నాగారాధనకు, నాగములకు సంబంధించిన పలు అంశములను Vogel పండితుడు అద్భుతముగా వివరించి విశ్లేషించెను. ఇవియే కాక ఇంకను అనేకములైన అంశములు వేద ఇతిహాస పురాణాదులలో కానవచ్చు చున్నవి. వీనిలో కొన్ని మాత్రము ఇచట స్థాలీపులాకన్యాయమున సంగ్రహముగా ప్రస్తావింపబడుచున్నవి.
- ఈ.ఏ. శింగరాచార్యులు

- ₹108
- ₹72
- ₹216
- ₹270
- ₹324
- ₹270
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE