-
-
శ్రీ సాయిబాబా శాసనములు-ప్రవచనములు
Sri Saibaba Sasanamulu Pravachanamulu
Author: K. Venkata Rao
Pages: 390Language: Telugu
ఆంగ్లమూలం: శ్రీ బి.వి.నరసింహాస్వామి; తెలుగు సేత: ఖరిడేహాల్ వేంకటరావు
ఆధ్యాత్మతత్త్వ లక్ష్యము ఆత్మజ్ఞానము. కాని లక్ష్యము సాధించుటకు అనుసరించు మార్గములు వ్యక్తి అవసరముల కనుగుణముగా ఉండవలెను. శరీరధారియైన బాబా, తన భక్తులకు మూర్తీభవించిన పరమాత్మ తత్త్వము: తన యొక్క ప్రతిమాట, చర్య ద్వారా సాధకులకు వెలుగు మార్గము చూపెను. దేహము త్యజించినప్పటికి, ఒకప్పుడు ఆ దేహమందున్న బాబా నిరంతరము పరమాత్మ స్వరూపముగా ఉంటూ, తన దివ్యానుగ్రహము నభిలషించు అసంఖ్యాకమైన భక్తులను, జీవించియున్నప్పటి వలె సేద దీర్చుచుండును. సాధకుడు, తన విశ్వాసము బలపడుటకు, ఇంద్రియములకు గ్రాహ్యమైన వ్యక్తరీతులు అవసరమని భావించును. శ్రీ నరసింహస్వామి సంకలన పరచిన ‘శాసనములు - ప్రవచనములు’ మాటల రూపములో సాధకుని అవసరము తీర్చగలదు. శ్రీమద్భగవద్గీతలో కృష్ణభగవానుడు వ్యక్తమైనట్లు ‘శాసనములు - ప్రవచనము’లలో బాబా వ్యక్తమగును.
ఈ సంకలనము సాధకుని మార్గములో వెలుగు చూపుననుటకు సందేహము లేదు. కాని అదే విధముగా, బాబా జీవించియున్న కాలములో వారి పాదముల చెంతనుండు అపూర్వావకాశము కలిగిన నావంటి అల్ప మానవులు వెనుకటి దినములకు మరలి, ఆనాడు బాబా సమక్షములో పొందిన ఆనందానుభవ సన్నివేశములను మరల జ్ఞప్తికి తెచ్చుకొనుటకు తోడ్పడును.
‘శాసనములు-ప్రవచనములు’ ఆధ్యాత్మిక లోకమునందే కాక, భౌతిక ప్రపంచంలో కూడ ఆచరణాత్మక బోధలుగా ఉపయోగపడును. బాబాను శరీరధారిగా, జీవునిగా, శివస్వరూపముగా చిత్రించుకొను తీవ్రసాధకుని ప్రేమ ఈ సంకలనములో సర్వత్ర కనుపించును. ఒకప్పుడు బాబా ‘నేను నీ సేవకుడ’నని పలికెను. తరువాత ‘నేను అల్లా సేవకుడ’ననెను. మరల, ‘అతనే నేను’ అని చెప్పెను. ఇచట బుద్ధి విఫలమగును. కాని మనోబుద్ధుల కతీతముగా నున్న ఆత్మ గోచరించును. దేహముతోనున్న బాబా ప్రాముఖ్యము లేని ఒక సామాన్య మానవుడు; దేహధారికి శివస్వరూపమునకు మధ్య ‘జీవుని’గా యంత్రములోని చక్రము వలె ఉండెను. కాని వీటి కతీతముగా అతడు సాక్షాత్తు శివుడు.
విజ్ఞానశాస్త్ర పురోగతి ఏదో ఒకనాడు బుద్ధి పరిధిలో ఈ మూడు స్థాయిలు సమన్వయమగునట్లు చేయును. ఈ గ్రంథములో చెప్పబడిన మహిమలు సంశయాత్ములను అబ్బురపరచును. భక్తులకు, బాబా అనంత తత్త్వమున కనుగుణముగా, ఈ మహిమలు సామాన్య మానవుని ఆధ్యాత్మిక పురోగతి ప్రక్రియలో కేవలము కొన్ని సన్నివేశములు. కాని ప్రేమ విశ్వాసముల నేపధ్యంలో అర్ధవంతమైనవి.
- న్యాయమూర్తి ఎమ్.బి.రెగె
Notify me when print book is available.