-
-
శ్రీ సహస్రలింగార్చన పూజా విధానము
Sri Sahasralingarchana Puja Vidhanamu
Author: Vayuvegula Bhaskara Sarma
Publisher: Shri Veda Bharathi
Pages: 336Language: Telugu
ఈ జగత్తు దేనియందు సంచరించి, దేనియందు లయం చెందుతుందో అదే లింగము. దీని మొదలు ఏదో, చివర ఏదో చెప్పటానికి వీలుకాదు. కనుక, ఆద్యంతములు లేనిదే లింగము. లింగ తత్వమే - ఆత్మ కనుక ప్రతి దేహమందు ఆత్మ అనే లింగము ఉంటున్నది. ఆ లింగస్వరూపుడే శివుడు. అగమ్యము, అగోచరమైన దివ్యతత్వమును విూరు గ్రహించుటకు నిదర్శనముగా లింగము ఉద్భవించుచున్నది. లింగం అనంత నిరాకార పరబ్రహ్మమునకు చిహ్నము."
పరమశివుడు (పరబ్రహ్మము - బ్రహ్మము - సదాశివుడు మహాదేవుడు) స్వశక్తి (శుద్ధమాయా - పరమశివా) సమేతుడు. ఆయన సర్వజ్ఞత్వ, సర్వేశ్వరత్వ, సర్వాత్మకత్వ, సర్వాంతర్యామిత్వాది మహాలక్షణ యుక్తుడు. ఆయన తన విశ్రాంతికి - లీలా విహారమునకు - అవకాశముండుటకు విష్ణువును, బ్రహ్మను సృజించెను. వారిని ప్రపంచ సృష్టి స్థితి కృత్యములకు నియోగించెను. ఆ బ్రహ్మయొక్కపాలభాగమున తానుద్భవించి, రుద్రుడనబడెను. ఈయన హరి బ్రహ్మలవలె మాయావశుడు కాడు. ఈయనకు పరమశివునకువలె సర్వజ్ఞత్వాది లక్షణములు కలవు. కావున పరమశివునకును ఈయనకును భేదమేమాత్రమును లేదు. ఈయన బ్రహ్మ విష్ణువులకు అవసరమైనపుడు సృష్టి స్థితి కృత్యము లందును, దుష్టశిక్షణ శిష్టరక్షణము లందును సహాయుడై యుండును. ఇట్టి రుద్రుని లింగ రూపమున అందరును ఆరాధింపదగును.
- గంటి వేణుగోపాలరావు

- ₹120
- ₹450
- ₹480
- ₹72
- ₹810
- ₹72