-
-
శ్రీ సద్గురు నారాయణ మహరాజ్ జీవిత చరిత్ర
Sri Sadguru Narayana Maharaj Jeevitha Charithra
Author: Charan Janamanchi
Publisher: Self Published on Kinige
Pages: 188Language: Telugu
ఆలోచనను ఆలోచించే ఆలోచనే దేవుడు. ఆ దేవుణ్ని మనస్పూర్తిగా ఏ ఫలాపేక్ష లేకుండా కొలవడమే భక్తి. మనిషికి నిజమైన ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగితే ప్రాపంచిక విషయాలపట్ల మమకారాలు కలుగవు. సృష్టి అంతా భగవంతునిదే అయినప్పుడు, ఆలయంలోనే దేవుడు కొలువై ఉన్నాడనుకోవడం మన మూర్ఖత్వం. మనం దేవుణ్ని గుర్తించక దేవుని పూజించడంలో అర్థం లేదు. అధ్యాత్మిక దృష్టితో చూడండి, ఈ లోకమంతా నారాయణమయం.
సద్గురువు శ్రీనారాయణ మహారాజ్‌ను ఈ పుస్తకం ద్వారా మీకు నేను కేవలం పరిచయమే చేస్తున్నాను, అంతే తప్ప సృష్టిమయం అయిన శ్రీనారాయణ మహారాజ్ జీవితాన్ని ఈ పుస్తకంలో వర్ణించగల శక్తిసామర్థ్యాలు నాకు లేవు.
చావుపుట్టుకల చక్రంలో ఎన్ని సార్లు చస్తూ బ్రతుకుతున్నాము మనం. మళ్ళీ పుట్టుకలేని, మరణం ఎరుగని ముక్తిని సంపాదించుకొని జీవితాన్ని సుఖమయం చేసుకుందాం. అందుకోసం శ్రీనారాయణ పాదాల చెంత చేరుదాం. ముక్తిమార్గంలో ప్రయాణించుదాం. సుఖాల కొరకు ప్రాపంచిక విషయాలకు లొంగిపోయి, జీవితాన్ని దుఃఖమయం చేసుకోకండి. ముక్తి కలుగజేసే శ్రీ నారాయణమహారాజ్ జీవిత చరిత్ర చదివి తెలుసుకొని ముక్తిని సంపాదించండి.
- చరణ్ జనమంచి

- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108