• Sri Ramakrishna Bodhamrutam
  • Ebook Hide Help
    ₹ 81
    90
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీరామకృష్ణ బోధామృతం

    Sri Ramakrishna Bodhamrutam

    Pages: 456
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీరామకృష్ణ బోధామృతం సర్వవేదాంత సారామృతం. "Sayings of Sri Ramakrishna" అనే గ్రంథానికి అనువాదమైన ఈ పుస్తకం ఈ మలికూర్పులో చక్కగా సంశోధింపబడింది, అంతేగాక విపులీకరింపబడింది. తొలికూర్పులో పునరుక్తమైన 68 ఉపదేశాలు ఇందులో తొలగింపబడి వాటి తావున కొత్తవి చేర్చబడటమేకాక, ఇంచుమించుగా నూటయిరవై ఉపదేశరత్నాలు పది పన్నెండు పునరుక్తమైనవి ఇంకా నిలిచివున్నా మొత్తంమీద ప్రస్తుత ముద్రణలో 1121 మహోపదేశాలు చోటుచేసుకున్నాయి. ఎనభైకి మించినవి నీతికథారత్నాలు. ఈ దివ్యోపదేశాలన్నీ అత్యంత ప్రమాణభూతాలైన మూలగ్రంథాల నుంచి ఏర్చి కూర్చినవి.

కొత్తవిషయాలను చేర్చటమేకాక, మానవుడి ఆత్మవికాస క్రమాన్ని అనుసరిస్తూ, నూతనవిధానంలో బోధనలను ఇందులో పొందుపరిచిఉన్నాం. గురుదేవుడి బోధనల్లోని మూలతత్త్వాలతో సంక్షిప్త జీవితచరిత్ర, స్వవచనాలలో గురుదేవుడి దివ్యానుభావాలను తెలిపే ప్రత్యేక ప్రకరణం, బోధనలను బాగా గ్రహించటానికై తోడ్పడే ఉప శీర్షికలు, ముఖ్యమైన తావుల్లో వేదశాస్త్ర ప్రమాణాలు - ఇవి ఈ మలికూర్పుకు ప్రత్యేక లక్షణాలని గ్రహించగలరు.

- చిరంతనానందస్వామి

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Bodhamrutam