• Sri Rama Bhakta Hanuma - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శ్రీరామ భక్త హనుమా! (free)

    Sri Rama Bhakta Hanuma - free

    Author:

    Publisher: J.V.Publishers

    Pages: 68
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీరామ భూవరుని బంటు హనుమంతుడు. ఈశ్వరాంశ సంభూతుడు. అణిమాది సమస్త సిద్ధులూ కలిగినవాడు, సుందరుడు. సకల దుష్టగ్రహదోష నివారకుడు. చతురామ్నాయవేత్త. నవవ్యాకరణ పండితుడు. రామభక్తాగ్రగణ్యుడు. జగజ్జనని సీతమ్మ దుఃఖాన్ని దూరం చేసిన మహాత్ముడు. రామసుగ్రీవుల మైత్రికి కారణభూతమైనవాడు, చతురవాగ్మి.

శ్రీ ఎమ్మెస్వీ గంగరాజుగారు గొప్ప కథా రచయిత, కవి. శ్రీరామ భూవరా శతకకర్త, స్నేహశీలి నిర్మలమైన మనస్సు, స్వచ్ఛమైన మాట, ఋజువర్తన కలిగినవారు. మంచి భక్తులు.గోరంత గుణాన్ని కొండంత చిత్రించే గుణగ్రహణ పారీణులు, గుప్తదాత. ప్రతిఫలాపేక్షలేని కార్యదక్షులు. నిరంతర పరిశ్రమ, నిస్తుల క్రమశిక్షణ, వినయోదంచిత ప్రతిభ ఆభరణాలుగాగల సాహిత్య సౌహిత్య మర్మజ్ఞులు.

పద్యం తెలుగు భాషకొక అమూల్యాలంకారం. శతకం ఆంధ్ర సారస్వత మకుటం. ఛందస్సులో లాఘవాన్ని పెంపొందించుకోవడానికి, ఆర్తి, నీతి, ధర్మం, సామాజిక సమతౌల్యం మొదలైనవి వ్యక్తం చేయడానికి బ్రహ్మాస్త్రం వంటిది శతకం. భక్తికి రాచబాట, శరణాగతికి రహదారి శతకమే.

హనుమంతుడు, గంగరాజుగారు, శతకం - త్రివేణీ సంగమం. పాపపంకిల హరమైన గంగాసాదృశ్యుడు హనుమంతుడు; అవిచ్ఛన్నమై, అజరామరమై సుకవి రూప గోపీజన సేవితమైన శతకప్రక్రియ యమునా స్వరూపం. అంతరంగంలో రాముణ్ణి, జిహ్వాగ్రంలో రామబంటును నిలుపుకొని, తన అహంకారాన్ని, అస్తిత్వాన్ని తృణీకరించి సారస్వతజీవన ప్రవాహాన్ని ధరించి, భక్తికి - పద్యానికి నడుమ అంతర్వాహినియైన సరస్వతీ స్వరూపం మా కవిరాజు గంగరాజుగారు.

తొలిశతకం పుట్టిన లగ్నమేదో కాని, తెలుగు సాహిత్యంలో ఇప్పటికి లక్షపైగా శతకాలు ఆవిర్భవించాయి. ఇది అతిశయోక్తి కాదు. ఇటీవల చిగురుమళ్ళ శ్రీనివాస్ అనే కవి ఒకే పర్యాయం వంద శతకాలు రచించి, ఆవిష్కరించారు. తలారి రాముని సంతానంలా పుట్టుకొచ్చిన శతకాల్లో బ్రతికి బట్టకట్టినవి, జనాల నోళ్లలో నానినవి వ్రేళ్లమీద లెక్కించగలిగినన్నే. అలాగని వ్రాయడం ఎవరూ ఆపట్లేదు. పుస్తకాల సంఖ్య పెరగడానికి కొందరు, కవిలోకంలో స్థానానికి కొందరు... అన్నింటికీ మించి... ఆత్మతృప్తి కోసం... ఇలా శతకాలు పుడుతున్నాయి. అదొక రాళ్ళగుట్ట! అందులో దొరికిన మేలిమి రత్నం ఈ 'శ్రీరామభక్త హనుమా' శతకం.

- ఆముదాల మురళి