-
-
శ్రీ రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సంచిక
Sri Rajaraja Narendra Pattabhisheka Sanchika
Author: Ravi Krishna Modugula
Publisher: Bommidala Srikrishnamurthy Foundation
Pages: 344Language: Telugu
తూర్పు చాళుక్యుల పాలన ఆంధ్రుల చరిత్రలో సుదీర్ఘంగా కొనసాగింది. అంతేకాదు, రాజకీయ, భాషా, సాంస్కృతికపరంగా తెలుగు నేలను ఏలిన రాజవంశాల్లో తూర్పుచాళుక్యవంశం పేరెన్నిక గన్నది. తెలుగు సాహిత్యం రేకలు విచ్చుకుంటున్న ప్రభాత సమయం. అదొక చారిత్రక విభాత సంధ్య. తెలుగు చరిత్రలో, ఆ తర్వాతి కాలంలో అనేకానేక సాహిత్య, సాంస్కృతిక ఘటనలకు కేంద్రంగా భాసిల్లిన రాజమహేంద్రవరం చాళుక్యుల రాజధాని. అంతేనా? కాదు. చరిత్ర కేవలం రాజకీయ సంఘటనల సమాహారమో, గతకాలపు ఇతిహాసమూ కాదు. గతమెంత ఘనమైనదో, అది మిగిల్చిపోయిన వారసత్వ సంపద ఏమిటో యీ తరానికే గాక, తరతరాలకు తెలియాలి. దాన్నుండి సమాజం చైతన్యం కావాలి. గతాన్ని కీర్తించడం, కేవలం దాని ఘనతను ఉగ్గడించడం కాదు. స్ఫూర్తి పొందాలి. ఆ స్ఫూర్తి తరతరాలకు ఉండాల్సిన అవసరం వుంది. గతంలోని లోపాలను, పొరపాట్లను యిప్పటి తరానికి తెలిసిరావాలి. వర్తమానంలో చరిత్ర రచన, పరిశోధన, పఠనం, సంతృప్తికరంగా లేవు. ఆలోచనా పరులను కలవరపెడ్తున్న సందర్భం ఇది. పాఠశాల స్థాయి నుండి, ఉన్నత విద్య, పరిశోధనలతో సహా చరిత్ర నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్నది. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం లేదా ? చరిత్రతో పాటు సామాజిక శాస్త్రాలన్నీ సమాజ గమనానికి దిక్సూచి లాంటివి. అవి నిర్లక్ష్యానికి గురయితే, చుక్కాని లేని నావలా తయారవదా సమాజం ? ఇదే యీ సంచిక కర్తల తపన, ఆవేదన.
- వకుళాభరణం రామకృష్ణ
- ₹194.4
- ₹216
- ₹86.4
- ₹108
- ₹162
- ₹140.4
Thought of buying this book, but after seeing that publishers found it worth to mention 'romilla thapar' name among prominent historians in their introduction, i am in double-mind. Thanks to anyone who can point to any reviews of this book.