-
-
శ్రీ పాంచరాత్రాగమోక్త భగవదారాధన విధిః
Sri Pancharatragamokta Bhagavadaradhana Vidhi
Author: Dr. N. L. Narasimhacharya
Publisher: Gayathri Prachuranalu
Pages: 268Language: Telugu
శ్రీ పాంచరాత్రాగమోక్త భగవదారాధన విధిః
(తెలుగు వివరణ - విశేషములతో)
అర్చకుల కరదీపిక
దేవాలయమంటే భారతీయులకు భగవంతుడుండే స్థానం మాత్రం కాదు. భారతీయ సంస్కృతికి అది మూలస్థానం. ఆ దేవాలయంలో ఉన్న అర్చకుడు శాస్త్రబద్ధంగా అర్చన చేసినప్పుడే మన సంస్కారం వికసించడంతోపాటు దేవాలయమూ కళకళలాడుతూ ఉంటుంది. లోక కల్యాణమూ జరుగుతుంది. అందువల్ల పాంచరాత్రాగమోక్తంగా అర్చన చేసే అర్చకులకు నిత్యోపయుక్తమై కరదీపికగా ఉండేలా ఈ గ్రంథం రూపొందించబడింది.
నేటి ఆధునిక కాలపు సామాన్యులైన అర్చక స్వాములకొరకై -ముద్రలు ఎట్లు పట్టవలెనో, ఏ క్రమమున అర్చామూర్తికి కైంకర్యములు జరుపవలెనో - పుణ్యాహవాచన విధిలో ఏమి పాటించవలెనో - చక్కగా వివరిస్తూ కల్యాణప్రయోగములో పాటించవలసిన నియమాలను చక్కటి తెలుగు వివరణలతో ఈ గ్రంథంలో అందించబడింది. ముఖ్యంగా, "ప్రవరలు" తెలియక తికమక పడువారికి ఈ గ్రంథంలో తెలిపిన శ్రీరామ, సీత, శ్రీకృష్ణ, రుక్మిణి, సత్యభామ, శ్రీరంగ, గోదాదేవి, ప్రవరలు చాలా మార్గదర్శకంగా ఉంటాయి. సామూహిక అర్చనలకు ప్రాధాన్యత ఉన్న ఈ రోజుల్లో ఆ అర్చనలు జనసామాన్యంతో ఎలా చేయించాలో సవివరంగా తెలుపబడింది, శ్రీ పాంచరాత్ర అర్చకస్వాములు ఆగమ పాఠంతో సరిపెట్టుకోజాలరు. శేరీ వైష్ణవ ద్రావిడ ప్రబంధాలు, స్తోత్రాలు కూడా అనువదించవలసియున్నది. అలాంటి నిత్యానుసంధాన రూపాలను వీరు ఈ గ్రంథంలో చేర్చడం వల్ల ఈ గ్రంథ పరిమళం, ప్రయోజనం ఇనుమడించినది. ముఖ్యంగా దేవాలయాలలో తిరునక్షత్రములు జరిపే తనియలు చాలా చక్కగా అర్చకస్వాములకు ఉపయోగపడతాయి.ఇంకా అర్చకులకు అవసరమైన ఎన్నియో విషయాలు సప్రమాణంగా తెలుపబడ్డాయి.
ఈ గ్రంథాన్ని చక్కగా అధ్యయనం చేసి ఆచరిస్తే దేవాలయ ప్రమాణాలు కొంత వరకైనా పరిరక్షింపగలుగుతాయి.
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
Shop address teliya jeyagalaru
The preview should show at least table of contents. else its useless.