-
-
శ్రీ పద్మ మహాపురాణము
Sri Padma Maha Puranamu
Author: Granthi Latha
Publisher: Victory Publishers
Pages: 600Language: Telugu
హృదయరూపమైన పద్మమును ఎవరు శ్రద్ధగా వింటారో వారు అమృతమును పొందుదురు. నారాయణుడే స్వయముగా ఈ పద్మపురాణ రూపమును పొందెను. ఈ పురాణములో ఒక అధ్యాయమును అధ్యాపనము చేసినచో సమస్త పాపముల నుండి ముక్తుడగును. అందులో స్వర్గ ఖండము మొత్తము పురాణము యొక్క ఫలము నిచ్చును. పాము తన కుబుసమును వదలినట్లు మహాపాతకులు కూడ స్వర్గఖండమును వినుట వలన పాపముల నుండి విముక్తులగుదురు.
ఎంతటి దురాచారుడైనను, సర్వధర్మ బహిష్కృతుడైనను ఈ సర్గమును (స్వర్గ ఖండమును) వినుట వలన అదే ఫలమును పొందుదురు. (సర్వపాప విముక్తులగుదురు) మాఘ మాసములో ప్రయాగలో స్నానము చేసిన వాడు సర్వపాప విముక్తుడగును. అలాగే స్వర్గ ఖండమును వినుట వలన పాప విముక్తుడగును. స్వర్గఖండమును శ్రవణము చేయువాడు, వినువాడు తనకు సమతూకమైన బంగారమును, భూమినంతటిని దానమిచ్చిన ఫలమును పొందును. ఋణగ్రస్తుడైన దారిద్య్రునకు చేసేదానము, నిరంతరముగా వేయి హరినామములను పఠించుటవలనను, వేదములను చక్కగా అభ్యసించుట వలనను, చేయవలసిన కర్మలనన్నింటిని చేసినందువలనను లోకములో భయపడువారికి అభయమిచ్చిన వాడును, గుణవంతులు జ్ఞానవంతులు, ధర్మవంతులచే మానితుడైనవాడును, సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటక రాశిని విడిచినంత వరకు ఉన్న మధ్య కాలములో చల్లని నీటిని ఇచ్చువాడు, బ్రాహ్మణులు, గోవుల కోసము తన ప్రాణములను త్యజించువాడు, ధీమంతుడైనవాడు చేసే సుకర్మల వలన పొందు ఫలమును ఈ ఆది ఖండమును వినుట వలనను వినిపించుట వలన పొందును.
స్వర్గ ఖండమును చక్కగా అభ్యసించుట వలన నానా భోగములను అనుభవించును. సుఖముగా నిద్రించిన పిదప అంతఃపుర నారీగణాలచే, సిరిమువ్వల అందెల సవ్వడితోను, మధుర భాషణలతోను మేలు కొలుపబడును. ఇంద్రుని అర్ధాసనము పొంది ఇంద్రుని స్వర్గలోకములో చిరకాలము సుఖించును. అక్కడినుంచి సూర్య లోకమునకు పిదప అక్కడి నుంచి చంద్రలోకమునకు వెళ్ళును. అక్కడి నుంచి సప్తర్షి లోకములకు వెళ్ళి అక్కడ సమస్త సుఖములను అనుభవించి ధ్రువలోకమునకు అక్కడ నుంచి బ్రహ్మ లోకమునకు వెళ్ళి తేజోవంతమైన శరీరమును పొందును. అక్కడ జ్ఞానమును సంపాదించి ముక్తిని పొందును. ధీమంతులు సద్గుణములు కలవారితో (సద్భిః) సహవాసము చేయుదురు, ఉత్తమ తీర్ధములలో స్నానమాచరింతురు. భగవత్సేవా సంబంధమైన మంచి మాటలు మాట్లాడుదురు, పావనమైన శాస్త్రములను శ్రవణము చేయుదురు. వాటిలో పాద్మము (పద్మ పురాణము) మహా శాస్త్రము. సర్వామ్నాయ (సమస్త వేదముల) ఫల ప్రదం. అందులో (పద్మ పురాణములో) స్వర్గఖండము మహా పుణ్య ఫలప్రదము.
- ప్రచురణకర్తలు
is this full padma puranam or else is there any other volume?
please provide print book of this