-
-
శ్రీ నామ్దేవ్ మహారాజ్ జీవిత చరిత్ర
Sri Namdev Maharaj Jeevita Charitra
Author: Charan Janamanchi
Publisher: Self Published on Kinige
Pages: 92Language: Telugu
భక్తి, జ్ఞాన, సంకీర్తన మార్గాల ద్వారానే ఆధ్యాత్మిక పథంలో ముందుకుపోగలరు. ఏ మార్గం ప్రత్యేకత ఆ మార్గానిదే. ఏ మార్గం దారి ఆ మార్గానిదే. భక్తి ద్వారా కొందరు ముక్తిని పొందితే, జ్ఞానం ద్వారా కొందరు, సంకీర్తనల ద్వారా మరికొందరు పొందారు.
తాను పొందిన అనుభూతులను, తపనలను గానం ద్వారా ఈ ప్రపంచానికి విఠలుని గొప్పతనాన్ని చాటిన మహనీయుడు నామ్దేవ్ మహారాజ్. తన మధురమైన గొంతుతో శ్రావ్యమైన కీర్తనలను గానం చేస్తూ పల్లెపల్లె తిరిగి పాండురంగని మహిమలను, కీర్తిని, తెలుపుతూ జన్మ ధన్యం చేసుకొని, ముక్తిని పొందిన గొప్ప భక్తాగ్రేణ్యుడు శ్రీ నామ్దేవ్ మహారాజ్.
అలాంటి గొప్ప భక్తాగ్రేణ్యుడి జీవిత చరిత్రను మీ ముందు ఆవిష్కరించడానికి నే చేసిన చిరుప్రయత్నమే ఈ పుస్తకం. చదివి విఠలును గొప్పతనాన్ని మరోసారి నామ్దేవుల వారి జీవిత చరిత్ర ద్వారా అనుభూతి పొందుతారని ఆశిస్తున్నాను.
- చరణ్ జనమంచి

- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108