-
-
శ్రీ మార్కండేయ పురాణం
Sri Markandeya Puranam
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 136Language: Telugu
వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను రచించాడు వ్యాసమహర్షి. మానవాభ్యుదయం కోసం వెలువడిన ఈ పురాణ వాఙ్మయసారాన్ని సంక్షిప్తంగా సంకలనం చేసి అందిస్తే, ఈనాటి సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని సంకల్పించాదు మా శిష్యమిత్రుడు డా. జయంతి చక్రవర్తి. తన ఓర్పు నేర్పులతో అష్టాదశ పురాణాల ఆంతర్యాన్ని వాడుక భాషలో నేటి జనసమాన్యానికి అందుబాటులోకి తెచ్చే పవిత్రమైన బాధ్యతను నెరవేర్చాడు.
పురాణ వాఙ్మయంలోని పుణ్యకథా విశేషాలను ఈనాటి సమాజానికి పంచే కృషిలో పాలుపంచుకుంటున్న మా చక్రవర్తి, సంప్రదాయ సాహిత్యాన్ని ప్రచురించే సత్కార్యాన్ని మహాయజ్ఞంగా స్వీకరించిన ప్రచురణకర్త శ్రీ బాలాజీ పబ్లికేషన్స్ వారు ఎంతైనా అభినందనీయులు.
- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి
* * *
అష్టాదశ పురాణాలలో శ్రీ మార్కండేయ పురాణం ఏడవది. "మార్కండేయం దక్షిణోంఽఘ్రిః" శ్రీ మహా విష్ణువుకి కుడి పాదంగా మార్కండేయ పురాణం చెప్పబడింది. ఈ పురాణంలో మొత్తం 136 అధ్యాయాలున్నాయి. వీటిలో శ్లోకాలు తొమ్మిదివేలు పూర్వం వుండేవి. ప్రస్తుతం లభిస్తున్న ప్రతిలో ఆరువేల తొమ్మిదివందల శ్లోకాలు మాత్రమే కనిపిస్తున్నాయి.

- ₹64.8
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72
- ₹72