-
-
శ్రీ మార్కండేయ మహాపురాణం
Sri Markandeya Mahapuranam
Author: Avancha Satyanarayana
Publisher: Victory Publishers
Pages: 591Language: Telugu
మార్కండేయ మహాముని చేత చెప్పబడిన పురాణం కాబట్టి దీనికి మార్కండేయ పురాణమనే పేరు వచ్చింది. విస్తృతిలో ఈ పురాణం చిన్నదేనని చెప్పాలి. ఈ పురాణం మొత్తాన్ని పర్గీటర్ ఆంగ్లంలోకి అనువాదం చేశాడు. దీనిలోని తొలి కొన్ని అధ్యాయాలు జర్మన్ భాషలోకి కూడా అనువాదించబడ్డాయి. ఆ భాగంలో మరణాంతరం జీవుని స్థితి చెప్పబడింది. పశ్చిమ దేశీయ పండితుల అభిప్రాయం ప్రకారం ఈ పురాణం అతి ప్రాచీనమైనది. వారి దృష్టిలో ఇది చాలా ప్రజాదరణ గలది. అందరూ అవశ్యం అధ్యయనం చేయదగింది. నిజానికి వారి భావన సరియైనదే. ప్రాచీన కాలానికి చెందిన ప్రసిద్ధ బ్రహ్మవాదిని మహర్షిణి మదాలస పవిత్ర చరిత్ర ఈ గ్రంథంలో బాగా విస్తరించి వివరించబడింది. మదాలస పుత్రుడైన అలర్కునికి చిన్నతనం నుంచే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించినందు వలన అతడు మహారాజు అయిన తరువాత గూడా జ్ఞాన యోగ కర్మయోగాలను సమన్వయించి చూపించి పరిపాలన సాగించాడు. ఇందులో చెప్పబడిన దుర్గాసప్తశతి చాలా ప్రత్యేకత గలది. ఇందులో దేవీ భక్తులకు సర్వస్వరూపిణియైన దుర్గ యొక్క పవిత్ర చరిత్ర చాలా విస్తారంగా వర్ణించబడింది. దుర్గాసప్తశతి మహాకాళి-మహాలక్ష్మి-మహాసరస్వతీ రూపురాలైన దేవి యొక్క మాహాత్యాన్ని ప్రతిపాదిస్తూ 136 అధ్యాయాలలో విస్తరించింది. మన్వంతర వర్ణనం కూడా విస్తృతంగా కలిగిన పురాణం ఇది. కొన్ని వైదిక కర్మల ద్వారా అభీష్టఫలాలను ఏ విధంగా పొందవచ్చునో కొన్ని ఉపాఖ్యానాల ద్వారా విశదీకరించబడింది. అనేక విషయాలు మార్కండేయ పురాణం నుంచి దేవీ భాగవంలోకి స్వీకరించబడ్డాయి.
మార్కండేయ పురాణంలో 136 అధ్యాయాలు ఉన్నాయి. దీని శ్లోక శంఖ్య 9,000. కానీ ఇప్పుడు లభ్యమవుతున్న మార్కండేయ పురాణంలో కేవలం 6,900 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి.
- ప్రచురణకర్తలు

- ₹60
- ₹60
- ₹60
- ₹648
- ₹1080
- ₹324