-
-
శ్రీ మహాభారతము - విరాట, ఉద్యోగ పర్వాలు
Sri Mahabharatamu Virata Udyoga Parvalu
Publisher: Nirmala Publications
Pages: 567Language: Telugu
...నన్నయభట్టారకులు ఆంధ్ర మహాభారత (ఆది సభా పర్వాలు, అరణ్య పర్వం 4 ఆ - 142 వరకు) రచనకు, తిక్కన మహాకవి విరాట పర్వ రచనకు మధ్య 200 సంవత్సరాల దీర్ఘకాల విరామ కారణాలను యార్లగడ్డ వారు పరిశీలనాత్మకంగా వివరించారు. శైవమత విజృంభణ, వైష్ణవ మత వ్యాప్తి, శైవ బౌద్ధ వైష్ణవమత వైషమ్యాలు, మత సాంఫిుక సంఘర్షణలు ఆంధ్ర మహాభారత రచనా దీర్ఘకాల విరామానికి కారణాలని వీరు సోపపత్తికంగా నిరూపించారు. అందుకే కవిబ్రహ్మచే విరాటపర్వాదిని హరిహరరూప పరతత్త్వం ఆరాధించబడింది. కవిత్రయం వారి ఆంధ్ర మహాభారత రచనా ప్రయోజనం వైదిక ధర్మ ప్రతిష్టాపన. మహాభారత ధర్మచక్రాన్ని శ్రీకృష్ణుడు చతురతతో ఏ విధంగా తిప్పిందీ తిక్కయజ్వలా ఆచార్య బాలగంగాధరరావు గారు ధురంధరతతో నాటకీయ శైలిలో వ్యాఖ్యానించారు. ''సారపు ధర్మమున్ విమల సత్యము బాపము చేత బొంకుచేఁ బారము బొందలేక చెడఁబాఱినదైన యవస్థ...'' (మహాభారతము ఉద్యోగ. 3 ఆ. 273) పద్యాన్ని శ్రీ బాలగంగాధరరావు గారు విపులంగా వ్యాఖ్యానించారు. ధర్మగ్లాని సంభవించినప్పుడు, సత్య ఖననం జరిగినప్పుడు సమర్థులయిన వారుపేక్షిస్తే అది వారికే (ఉపేక్షించినవారికే) నష్టం కాని ధర్మ సముద్ధరణ చేయడానికి, సత్యానికి మేలు కలుగ చేయటానికి దైవమెప్పుడూ ఉంటుందని ఆచార్యులు నిరూపించారు. ధర్మానికి గ్లాని, అసత్య ప్రచారాలు జరుగుతున్న ఈ కాలంలో ఈ బోధ అత్యవసరం.
- ఆచార్య లకంసాని చక్రధరరావు
* * *
...ద్రుపద పురోహితుడు, సంజయుడు, ధర్మరాజు, కృష్ణుడు - ఇలాంటి వ్యక్తుల మనస్తత్వాన్ని పరిశీలించే ఘట్టాలలో ఆయన ఒకవేపు మంచి మనస్తత్వ శాస్త్రవేత్త అనీ, మరోవేపు రాజనీతి శాస్త్రాన్ని కూడ బాగా చదివేరనీ, మూడో వేపు అందమైన తెలుగులో ముచ్చట్లు చెబుతున్నట్టు విషయాన్ని చదువరికి ఇట్టే అందించే దిట్ట అనీ తెలుస్తుంది. దుర్యోధనుని భోజనాహ్వానం, పెద్దల యొక్క భోజనాహ్వానం, (బాహ్లిక, భీష్మ ద్రోణాదులు) అన్న సందర్భాలలో రచనా విన్యాసం చదివితే కృష్ణ, ధృతరాష్ట్రుల పారస్పర్యం పరిశీలిస్తే, సారపు ధర్మము విమలసత్యములు అన్న విషయ వివేచనను అనుశీలిస్తే, కృష్ణుని రాయబారములోని ఒడుపులను గమనిస్తే - మనకి మళ్ళీ మళ్ళీ అనిపించేది యీ వ్రాయసకాడు భారతంలోని ధర్మశాస్త్ర, వేదాంత, నీతి, కావ్య సందర్భాలను బాగా నరనరాల జీర్ణించుకొని పండిపోయిన మనీషి అనిపిస్తుంది! ఇంతకు ముందు భారతంపై వారు వ్రాసిన గ్రంథంలాగే యిదిన్నీ చదివి మళ్ళీ మళ్ళీ చదివి పుస్తకాన్ని మన గ్రంథాలయంలోను భావాలను మన మనఃపేటికలోనూ భద్రపరచవలసినంత గొప్పది అని నా తాత్పర్యం.
- ధారా రామనాథశాస్త్రి

- ₹324
- ₹86.4
- ₹324
- ₹594
- ₹108
- ₹86.4
- ₹324
- ₹86.4
- ₹324
- ₹594
- ₹108
- ₹86.4