-
-
శ్రీ మహాభారతము - భీష్మ, ద్రోణ పర్వాలు
Sri Mahabharatamu Bhishma Drona Parvalu
Publisher: Nirmala Publications
Pages: 469Language: Telugu
ఆచార్య బాలగంగాధరరావుగారు వర్తమాన కాలంలో వున్న పాఠకుల యొక్క శ్రోతల యొక్క వేగం, వాడి, నాడి తన అనుభవంచేత, పరిశీలన చేత తెలుసుకున్న వారు కావటం చేత యీ కవిత్రయ భారత మహేతిహాసాన్ని, ఏవిధంగా ఎటువంటి శైలిలో ఆ కవిత్రయ భారతాన్ని యిప్పటి పాఠకులకు అందించాలో అంత శ్రద్ధతో అందించారు. ఆయన యీ ఆలోచన ఆయన చేసిన వచనానుసరణంలో ప్రత్యక్షంలో కన్పిస్తుంది.
ఆచార్య బాలగంగాధరరావుగారు యీ వచన రచనలో యీ సులభత్వాన్నీ, సూటితనాన్ని అనుసరించారు. ఎక్కడా క్లిష్టతగాని, అన్వయరాహిత్యం గాని, పెద్ద పెద్ద వాక్యాలు గాని, సమాసముల వెల్లువగాని, రచనలో కనిపించదు అంతేకాదు ఆ శైలిలో కూడా, తెలుగుదనపు పలుకుబళ్ళు, నిత్య వ్యావహారిక జీవితంలో అందరూ మాట్లాడుకునే మాటలు, చక్కని వాక్యాలరూపంలో రూపొందుకున్నాయి. పాఠకులను ఇబ్బంది పెట్టకూడదనీ, వారికి విసుగు కలిగించకూడదనే ఉద్దేశంతో, కథను సరళంగా చెప్పాలనే ఆలోచనతో రచన సాగింది. అందుకే కవిత్రయ భారతంలో వున్న ప్రకృతివర్ణనలు, పాత్రల దీర్ఘప్రసంగాలు, వేదాంత విషయాలు, వున్నవి వున్నట్లుగా సులభంగా, సుబోధకంగా అందించగలిగారు.
తిక్కనగారి భీష్మ పర్వంలో 1100 పద్యాలపైబడి వుంటే వాటినన్నింటిని ఎక్కడా కథా లోపం రాకుండా పాఠకులను ఆకట్టుకునే రచన చేశారు. మూలంలో వున్న దీర్ఘమైన భగవద్గీతను, తిక్కన గారు 50 పద్యాలతో చెప్పిన దాన్ని ఆచార్య బాలగంగాధరరావు గారు యథాతథంగా, ఆ వేదాంత విషయాన్ని, మంచి వచన రచనలో గుదిగుచ్చారు. భగవద్గీత చదవాలనుకునే వారికి యీ రోజుల్లో భగవద్గీత, తెలుగు వ్యాఖ్యానాలు, ఇబ్బడిముబ్బడిగా లభిస్తున్నా తిక్కన గారి భగవద్గీత సారాన్ని, యథాతథంగా, వచనంలో నిలిపి, చదువుకోటానికి మనసులో నిలుపుకోవటానికి వారు చేసిన ప్రయత్నం చాలా ప్రశంసనీయం. ఆంధ్ర మహాభారతంలో కవిత్రయం వారు అనుసరించిన కథా కథనం, కథాన్వయం అదే క్రమంలో అనుసరించి కూడా వచన రచనలో తన ప్రత్యేకత చూపారు. ఇలా రచన చేయటం సాహసంతో కూడిన సముచితమైన నిర్ణయం. యుద్ధ వర్ణనలు కూడా ఆసక్తితో చదువుకునే రీతిలో సాగాయి.
భీష్మ, ద్రౌపది, ద్రోణాచార్యుల పాత్ర వివరణలో ఆయా సమయాల్లో మానవ మనస్తత్వ రీతులు ఆ విధంగా వుండవచ్చునని ఇప్పటి మానవ ప్రవర్తనా కోణంలో చూడడం అవసరమా! అని అనిపిస్తుంది. అయినా శ్రీ బాలగంగాధరరావు గారు ధర్మ పక్షపాతి అనటంలో సందేహం లేదు. కనుక - భారత పాత్రలను వ్యక్తులగానే చూడటంతోనే కాక మానవీయ కోణంలో వివరించటంలో చాలా ప్రశంసనీయంగా సాగటమే కాక, ముందు చెప్పినట్లు హేతుబద్ధంగా వుందనటం నిస్సందేహం - గ్రుడ్డిగా, ఆరాధనా భావంతో, కథ చదువుకుంటూ పోకుండా పాత్రల వెనక వుండే అంతరాత్మను పట్టుకోవాలి అనటం పురాణకథల పరిశీలనలో కొత్త కోణం. అవశ్య ఆదరణీయం.
- డా. చివుకుల సుందరరామశర్మ

- ₹86.4
- ₹324
- ₹324
- ₹594
- ₹108
- ₹86.4
- ₹86.4
- ₹324
- ₹324
- ₹594
- ₹108
- ₹86.4