• Sri Mahabhagavatamu
 • Ebook Hide Help
  ₹ 1620
  1800
  10% discount

  Home delivery

  • fb
  • Share on Google+
  • Pin it!
 • శ్రీ మహాభాగవతము

  Sri Mahabhagavatamu

  Pages: 2808
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

శ్రీ భాగవత మహాపురాణం శతాబ్దాలూ, సహస్రాబ్దాలూ గడిచినా అజరామరమై అలరారే వాజ్మయం. ఇది భక్తి జ్ఞాన వైరాగ్యాల సమ్మిశ్రితం. నారాయణుని దివ్యలీలాగాథలను వివరించటంతో పాటు వేదాంత తత్వాన్ని ప్రతిపాదించింది కాబట్టి భాగవతం భక్తి వేదాంత తత్వానికి పరాకాష్ఠ అని చెప్పబడుతున్నది. భాగవతంలోని భక్తి రసామృతం 'స్వాదు స్వాదు పదే’ - మరలా మరలా వినాలనిపిస్తూ, మాట మాట అధిక మధురమైనట్లు అనిపిస్తుంది. భాగవతామృతం రుచిమరిగిన వాడు వేరే రుచికి పోడు అన్న సామెత ఉండనే ఉన్నది కదా! అటువంటి వ్యాసప్రోక్తమైన భాగవతాన్ని పోతనామాత్యుడు తెలుగులోకి అవతరింపజేశాడు. పోతనామాత్యుని కవిత్వంలో లయాత్మకతతో కూడిన శబ్దమాధుర్యం పద్యాలలో చొప్పించిన భక్తిపారవశ్యత వల్ల భాగవతం తెలుగువారి నిత్యపారాయణగ్రంథం అయ్యింది. తాను నిమిత్తమాత్రుడై ‘నా చేత పలికించెడువాడు రామభద్రుడు’ అని చెప్పడంలోనే ఈ గ్రంథం ఈశ్వరప్రేరితమని అర్థమవుతుంది. పన్నెండు స్కంధాలు తొమ్మిదివేల గద్యపద్యాలతో కూడిన మహాభాగవతంనుండి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్కంధాలను మొదటి సంపుటంలో చేర్చడం జరిగింది. ప్రథమ స్కంధంలో శౌనకుని ప్రశ్న, సూతమహాముని భగవన్మహిమ, భక్తి మహిమ గురించి చెప్పడం, భగవంతుని అవతారాల సంఖ్యను ఉపలక్షణంగా చెప్పడం, నారదుని పూర్వ జన్మ వృత్తాంతం, పరీక్షిత్తు జననం కలిపురుషుడి ప్రవేశం, పరీక్షిత్తు శాపం పొందుట చోటు చేసుకోగా ఇక రెండవ స్కంధంలో శుకుడు పరీక్షిత్తుకు ముక్తిమార్గాన్ని ఉపదేశించుట, శ్రీమన్నారాయణుని లీలా అవతారాలను వర్ణించుట వివరించబడ్డాయి. విదురుని రాక, విదురమైత్రేయ సంవాదము, జయవిజయలకు సనకాదులచే శాపం, దేవహూతి గర్భమున విష్ణుడు కపిలాచార్యడుగా జన్మించుట, కపిలుడు దేవహూతికి భక్తియోగ మార్గాన్ని తెలియజేయుట మూడవ స్కంధంలో పొందుపరచబడ్డాయి.

భగవంతుని తత్వాన్ని నిర్గుణంగా, నిరాకారంగా, సగుణంగా, సాకారంగా, సర్వతోముఖంగా, సమగ్రంగా భాగవతంలో ప్రతిపాదన చేయడం జరిగింది. చతుర్ధ, పంచమ, షష్టమ స్కంధాలతో కూడినది రెండవ భాగం భగవంతుణ్ణి శరణు వేడకుండా కేవల ధర్మానుష్ఠానాలు చేస్తే ఆ యజ్ఞం నిష్ఫలమైనదని తెలిపే దక్షుడి కథ, అర్థ పురుషార్థానికి దృష్టాంతంగా ధ్రువుడు, పృథుచక్రవర్తి ఆధ్యాత్మిక దర్శనము, పురంజనోపాఖ్యానము, తత్త్వప్రధానంగా భగవంతుని గురించి వర్ణన, ‘విశ్వాత్మా! నీయందు వేరుగా జీవులగన దెవ్వడట వానికంటె ప్రియుడు’(4.193) అంటూ జ్ఞానప్రతిపాదిత పద్యసరళి చతుర్థ స్కంధములో వివరించబడ్డాయి. పంచమ స్కంధములో స్థితి వర్ణన ఉంది. భూగోళ-ఖగోళ, స్వర్గ-నరకములు ఎవరి ఆధారముతో స్థితమై ఉన్నాయో, వీటన్నిటిలో ఎవరు పూజింపబడుతున్నారో అతడే భగవంతుడు అని చెప్పబడింది. ఋషభావతార చింతన మరియు భరతోపాఖ్యానం కూడా చోటు చేసుకున్నాయి. అజామిజోపాఖ్యానం - ఎంతటి కర్మచ్యుతుడూ, కర్మభ్రష్టుడైనా చివరి శ్వాసతో భగవంతుని నామాన్ని ఉచ్చరించిన కారణంగా మోక్షాన్ని పొందుట; భగవంతుని రూపంతో, ధ్యానంతో, స్పర్శతో, జీవులకు హితము చేకూర్చిన విధం వివరించబడ్డాయి.

అవధూత శిరోమణి అయిన శుకుని ద్వారా భాగవత కథాశ్రవణమాత్రంచే ముక్తుడయ్యాడు పరీక్షిత్తు. శ్రవణనిష్ట కలిగిన పరీక్షిన్మహారాజుకు శుకయోగి వివరించిన అద్భుత కథల పేటికయే ఈ తృతీయ సంపుటం.
సప్తమ స్కంధంలో ప్రహ్లాదుని చరిత్రతో పాటు శ్రీ నరసింహుని అవతార వర్ణన, చతుర్విధ ఆశ్రమ ధర్మములు; అష్టమ స్కంధంలో క్షీరసాగర మథనం, నారాయణుని కూర్మ, వామన, మోహిని, మత్స్యావతారాల విశేషాలు; నవమ స్కంధంలో రామ, పరశురామ అవతారాలతో పాటు అనేక రాజుల చరిత్రలు పొందుపరచబడ్డాయి.

భాగవత తత్త్వము దశమ స్కంధములోనే ఇమిడి ఉంది. శ్రీకృష్ణుని లీలాగుణవిశేషాలను చిత్రీకరించి, జ్ఞానం భక్తిరసాంమృతంలో మిళితమై కనిపిస్తుంది. శ్రీ మహాభాగవతం నాలుగవ భాగంలో దశమ స్కంధం పూర్వభాగము వివరించబడింది.

శ్రీ మహాభాగవతం అయిదవ భాగంలో దశమ స్కంధం ఉత్తర భాగం, ఏకాదశ, ద్వాదశ స్కంధాలు పొందుపరచబడ్డాయి. దశమ స్కంధంలోని ఉత్తర భాగంలో శ్రీకృష్ణుని గుణగణాలు వెల్లడయ్యే కథనాలతో పాటు, కుచేలోపాఖ్యానం సఖ్య భక్తికి అపూర్వమైన ఉదాహరణ. ఇకపోతే ఏకాదశ స్కంధంలోని అవధూత కథ అతను తన ఇరవై నాలుగు గురువుల ద్వారా నేర్చుకున్న పాఠాలను స్పష్టం చేస్తుంది. గ్రద్ద నోటన ఉన్న చేప కోసం వెంటబడిన కాకుల వృత్తాంతాన్ని శ్రీరామకృష్ణులు తరచూ చెబుతూండేవారు. విషయవాసన అనే చేప మనతో ఉన్నంత వరకు కాకులనే కర్మలు ఉండనే ఉంటాయి. దాని ద్వారా ఎదురయ్యే చింత, విచారం, అశాంతి వెన్నంటే ఉంటాయి. వాసనలను త్యజిస్తే, తక్షణమే కర్మలు మననుండి వైదొలగుతాయి, ప్రశాంతత లభిస్తుంది. ద్వాదశ స్కంధములో కలియుగ లక్షణం, మార్కండేయోపాఖ్యానం, శ్రీమద్భాగవత మహత్త్వం వివరించబడ్డాయి.

- ప్రకాశకులు

గమనిక: " శ్రీ మహాభాగవతము" ఈబుక్ సైజు 18mb

Preview download free pdf of this Telugu book is available at Sri Mahabhagavatamu