• Sri Lalitashtottara Satakamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శ్రీ లలితాష్టోత్తర శతకము (free)

    Sri Lalitashtottara Satakamu - free

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది లలితాష్టోత్తరస్తుతికి కందపద్య రూపంలో అష్టోత్తరస్తుతి.

అనాదిగా కళలు ప్రధానంగా సంగీత నాట్యాలు భక్తికి అంగాలుగా నిలచి భక్తిని వృద్ధిపొందింప జేశాయి. తామూ నిలదొక్కుకున్నాయి. లలిత కళలలో కవిత్వం నాటినుండి, నేటివరకు వివిధ విన్యాసాలతో అలరారుతున్నా వాటిలో భక్తిభావం కూడ ఒక సుందరతర కళావిన్యాసమైనది. పురాణాలు యథాతథంగా, పురాణకథలు ప్రబంధరూపంగా భక్తిభావాన్ని తెలుగువారి గుండెలలో నిలిపాయి.

అవిగాక, శతకసాహిత్యం తెలుగులో భక్తిభావానికి పట్టుకొమ్మ అయినది. కవులు కవితాలోకంలోకి అడుగిడుతున్నప్పుడూ, కవితాకళలో పండిపోయిన తరువాతా ఇలా ఉభయదశలలోనూ ఏదో ఒకవేళ భక్తితో శతకరచనతో దైవసమార్చన చేసిన ఘటనలు లెక్కకు మిక్కిలి.

ఆకోవలో శ్రీమతి డా.సీతాదేవిగారి లలితాష్టోత్తరశతకమిది. ఇప్పటికి శతకమర్యాద సార్ధకమైనది తెలుగులో! అందరూ శతకమంటూ 108 పద్యాలు వ్రాసినవారే. కాని ఈకృతిలో 108 పద్యాలు ఉన్నాయి. పేరు అష్టోత్తరశతకం! అయితే ఆ అష్టోత్తర పదాన్ని ముందున్న లలితా పదానికి అన్వయిస్తే లలితాష్టోత్తరం!

అదే కృతిలోని యితివృత్తం! ఇటు అన్వయిస్తే అష్టోత్తరశతకం. యదార్ధమైన నామం. ముచ్చటగా ఉంది.

నామస్తోత్రాలలో లలితాష్టోత్తర, సహస్రనామాలది ఒక విశిష్టమైన ఒరవడి. భక్తి, తాత్వికతలతో పాటు కవితా సౌందర్యం కూడ వాటిలో కనిపిస్తుంది. ఒక విలక్షణమైన తాంత్రిక పూజావిధానంగా ఉన్న శ్రీవిద్యోపాసన ప్రాచీనకాలంలో విరళమైనా, ఆధునిక అత్యాధునిక కాలంలో సాత్విక పూజావిధానాలలో ఒకటిగా రూపొందింది. తెలుగునేల నాలుగు చెరగులా వ్యాపించింది.

ఆ అష్టోత్తరశతనామాలను, అష్టోత్తర కందపద్యాలుగా, ఉపచార విధిని వృత్తాలుగా కవయిత్రి రచించి పాఠకుల కందిస్తున్న కృతి యిది.

- సూరం శ్రీనివాసులు