• Sri Lalita Sahasranama Stotram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్

    Sri Lalita Sahasranama Stotram

    Publisher: Mallina Venkata Rao

    Pages: 106
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

దైవ భక్తిని పెంపొందించే స్తోత్రాలలో సహస్రనామాలకు ప్రముఖ స్థానము ఉంది. వేర్వేరు దేవీ దేవతలను ఉద్ధేశించి వేర్వేరు సహస్రనామాలు ఉన్నను శ్రీవిష్ణు సహస్రనామం, శ్రీలలితా సహస్రనామం - ఈ రెండింటికీ విశేష ప్రాముఖ్యత ఉంది. శ్రీవిష్ణు సహస్రనామం శ్రీమహా విష్ణువు యొక్క దివ్యతత్త్వమును వెలువరించగా శ్రీలలితా సహస్రనామం శ్రీమాతలోని దేవీతత్త్వమును వెలువరించుట జరిగింది. ఈ రెండు తత్త్వాలు వస్తుత: ఒకే పరతత్త్వం యొక్క రెండు రూపాలు. సగుణ భావంతో చూస్తే ఈ రెండు తత్త్వాలు వేర్వేరుగా కనిపించినా చిన్మయ దృష్టితో తన్మయ భావంతో తరచి చూస్తే ఈ రెండింటిలోను ఒకే పరతత్త్వం గోచరిస్తుంది.

శ్రీ మద్భగవద్గీత, శ్రీవిష్ణు సహస్రనామము, శ్రీలలితా సహస్రనామము మొదలగువాటిని పారాయణ చేయువారి సంఖ్య దినదినమునకు పెరుగు చున్నది. పారాయణతో పాటు భావ, తాత్పర్యములను కూడ తెలుసుకొనినచో విశేష ప్రయోజనము ఉంటుంది.

మరణించే శరీరం మరణించి నశించినా మరణించని అమరత్వాన్ని (ఆత్మను) దర్శించుటయే ఆత్మవిద్య. లౌకిక విద్యలు ఇహానికే ఉపకరిస్తాయి. లౌకిక విద్యతో పాటు ఆత్మవిద్య పట్లను శ్రద్ధ, అభిరుచి, సాధన కలిగి ఉంటే ఇహమూ, పరమూ రెండూ ప్రాప్తిస్తాయి. సాత్త్వికమైన సాధన, పరమపావనమైన భావన, నిర్మలమైన హృదయం, నిశ్చలమైన మనస్సు- వీటితో సహస్రనామాలను పఠించి వీటిలోని రహస్యమును తెలుసుకొనుటకు ప్రయత్నిస్తే తరిస్తాము.

శ్రీలలితా సహస్రనామం శ్రీరాగరంజితమైన మహాగానం. ఈ గానంలోనే జ్ఞాన విజ్ఞానాలు మిళితమై ఉన్నాయి. ఇది అర్చనకూ, అధ్యయనానికీ, ప్రార్థనకూ, పారాయణానికీ ఉపకరించే విజ్ఞాన సర్వస్వం. ఈ లలితా సహస్ర నామపారాయణ చేయగా చేయగా జీవితం తరిస్తుందని పరిపరివిధాల శ్రీహయగ్రీవుడు చెప్తాడు. అపమృత్యువు పొతుందట. ఆయుష్షు పెరుగుతుందట. ఆరోగ్యం చేకూరునంట.

ఈ నామాలను జపించగా జపించగా సాధకుడు శ్రీలలితా పరమేశ్వరి స్వరూపాన్ని పొందుతాడు. తనకూ, తన తల్లికీ భేదము లేదని గమనించిన సాధకుడు ఆ తల్లి అనుగ్రహం తప్పక పొందుతాడు. జీవితములో అంతకుమించిన ఆనందం మరియొకటి లేదు. జన్మ చరితార్ధం అవుతుంది.

- ఇలపావులూరి పాండురంగారావు

Preview download free pdf of this Telugu book is available at Sri Lalita Sahasranama Stotram