-
-
శ్రీ లక్ష్మి నారాయణ హృదయం
Sri Lakshmi Narayana Hrudayam
Author: Sindhu Yadamreddy
Publisher: Self Published on Kinige
Pages: 49Language: Telugu
శ్రీ లక్ష్మి నారాయణ హృదయం తాత్పర్య సహితం
‘అధర్వ రహస్యం’ అనే గ్రంధం లోని ఉత్తర ఖండం లోని శ్రీ భృగు మహర్షి కృత ‘లక్ష్మి నారాయణ హృదయం’ ( లక్ష్మి- నారాయణుల మనస్సు) ఎంతో అధ్భుతమయినది. ఇది చదివిన వాళ్లకు సకల సంపదలను ప్రసాదించడమే కాక, మంద బుద్ధులను కూడా విజ్ఞానఖనులను చేస్తుంది. ఇందులో ‘నారాయణ హృదయం’ , ‘లక్ష్మి హృదయం’ అని రెండు భాగాలు ఉన్నాయి. పవిత్రమయిన, పరమ శక్తివంతమయిన ఈ ప్రార్ధన ఎంతో కాలం గుహ్యంగా ఉంచబడింది. ఈ స్తోత్రం, గురు ముఖతా స్వీకరించ వలసిన అవసరం ఉంది. అలా వీలు లేని వాళ్ళు ఎక్కడయినా లక్ష్మీ సమేత హయగ్రీవుని సన్నిధికి వెళ్లి, ఆయనకు నమస్కరించి, హయగ్రీవుడిని గురువుగా భావించి, ఆయన వద్ద ఈ శ్లోకాన్ని ఉపదేశం తీసుకున్నట్లు అనుకోవాలి.
ఈ స్తోత్రం చదివేందుకు ఒక విధానం ఉంది. ముందుగా, నారాయణ హృదయం చదివి, తరువాత లక్ష్మి హృదయం చదివి, మరలా నారాయణ హృదయం చదవాలి. ఈ దివ్య దంపతులు సర్వదా విడతీయలేని అభేధ స్థితిలో, ఏకమయి ఉంటారు కనుక ఈ పారాయణ విధానం చెప్పబడింది.
i need this book