-
-
శ్రీలక్ష్మీ-కుబేర పూజాకల్పం
Sri Lakshmi Kubera Pooja Kalpam
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 104Language: Telugu
అష్టదిక్పాలకులలో ఉత్తర దిక్కుకు అధిపతిగా ఉన్న శ్రీకుబేరుడికి లోకంలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఐశ్వర్యప్రదాతగా, నవనిధి నాయకుడిగా కుబేరుడు ఎంతో మంది చేత తరతరాలుగా పూజింపబడుతున్నాడు. లక్ష్మీదేవి ఐశ్వర్య సృష్టికర్త అయితే ఆమె ద్వారా సృష్టించబడిన నవనిధులని అధికారి లేక అధిపతి కుబేరుడు. అందుకే ఐశ్వర్యం కోరుకునే భక్తులు
ముందుగా ఐశ్వర్యకారిణి అయిన లక్ష్మీదేవిని పూజించి, ఆ తరువాత ఐశ్వర్యప్రదాత కుబేరుడిని పూజించాలి.
ఈ గ్రంథంలో శ్రీలక్ష్మీదేవి షోడశోపచార పూజావిధానం, శ్రీ కుబేరుడి షోడశోపచార పూజావిధానాలతో పాటు ఐశ్వర్యప్రదమైన శ్రీలక్ష్మీదేవి దివ్య సహస్రనామాది స్తోత్రాలని, స్తుతులని, శివ అష్టోత్తర శతనామ స్తోత్రాల్ని కూడా అనుబంధంగా ఇస్తున్నాము
భక్తులందరు ఈ గ్రంథంలో తెలిపిన విధంగా శ్రీలక్ష్మీ - శ్రీ కుబేర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందవలసిందిగా ప్రార్థిస్తూ అందరికీ శ్రీలక్ష్మీ - శ్రీ కుబేరుల దివ్యానుగ్రహం కలగాలని ఆశిస్తూ....
- డా. జయంతి చక్రవర్తి

- ₹64.8
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72
- ₹72