-
-
శ్రీ కుబేర సాధన
Sri Kubera Sadhana
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 100Language: Telugu
శ్రీ కుబేర సాధన
ధనమే అన్నిటికీ మూలం అని ఆర్యోక్తి. ప్రతీ వ్యక్తికీ ధనంతో అవసరం వుంటుంది. ఎలాగైనా తన కష్టాల్ని పోగొట్టుకోవలని, ఐశ్వర్యం లభించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూంటారు. తాపత్రయపడుతుంటారు. అయితే పూర్వజన్మ కర్మానుసారం మాత్రమే ఐశ్వర్యం లభించటం, ధనవంతుడిగా జన్మించటం జరుగుతుంది. జీవుడు తాను చేసిన పుణ్యకర్మలకి అనుగుణంగనే అతడి జీవితం నిర్ణయించబడి వుంటుంది. అయితే మరి కర్మ ప్రారబ్దం చేత దరిద్రుడుగా జన్మించిన వాళ్ళకి తిరిగి ఐశ్వర్యం లభించే మార్గం లేదా అంటే ఉంది.
మన మంత్ర శాస్త్రాలలో ఐశ్వర్యాన్నిచ్చే దేవతగా శ్రీ కుబేరుడు ప్రత్యేకంగా కనిపిస్తాడు. మంత్ర మహోదథి, మంత్రమహార్ణవాది తంత్ర గ్రంథాలలో శ్రీ కుబేరుడి మంత్ర జపహోమ విధనాలు వివరంగా చెప్పబడ్దాయి.
ఈ గ్రంథంలో శ్రీ కుబేర స్వామి మంత్ర జప హోమ విధానలల్తో పాటు శ్రీ కుబేరుడి పూజావిధానాన్ని కూడా అందిస్తున్నాము. అలాగే శ్రీ కుబేర అనుగ్రహం కోసం ఆయనకి ప్రీతిపాత్రమైన శ్రీ లక్ష్మీదేవి స్తోత్రాలని, శివ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కూడా అనుబంధంగా అందిస్తున్నాం
అందరూ నవనిధినాయకుడైన శ్రీకుబేరుడి అనుగ్రహాన్ని పొంది ఐశ్వర్యంతో సుసంపన్నులు కావాలని ఆశిస్తూ....
- డా. జయంతి చక్రవర్తి

- ₹64.8
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72
- ₹72