-
-
శ్రీ కృష్ణావతారం 1 & 2
Sri Krishnavataram 1 And 2
Author: Swami Jnanadananda
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 107Language: Telugu
భగవంతుడంటేనే ప్రేమకు, ఆనందానికి, శాశ్వత శాంతికి నిలయం కదా! అలాంటప్పుడు భగవంతుడే అవతరింపబోయేటప్పుడు ప్రకృతి ఎంత రమణీయంగా శోభిల్లుతున్నదో కదా! అప్పుడు అర్థరాత్రి. అంతటా పరమ ప్రశాంతత నెలకొని వుంది. నిర్మలాకాశంలో తారలు ప్రకాశిస్తున్నాయి. రోహిణీ నక్షత్రం ఉదయించిన శుభవేళ. కొలనుల్లోని తామరలు పూర్తిగా వికసించివున్నాయి కృష్ణుని ఆహ్వానించడానికోసమో అన్నట్లు. మలయమారుతాలు వీస్తున్నాయి, కృష్ణుని గర్భంలో ధరించిన దేవకికి హాయి కలిగించడానికి.
అడవులందంతటా పక్షుల కిలకిలరావములు వినిపించసాగాయి. నెమళ్ళు ఫించాలు విప్పి ఆనందంతో నాట్యం చెయ్యసాగాయి. ప్రకృతి అంతటా శోభాయమానమైన ఆనందమే తొణికిసలాడుతూంది. దేవలోకంలో భగవంతుని అవతరణను సూచించే దేవ దుందుభులు మ్రోగాయి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఇలాంటి శుభసమయంలో అర్థరాత్రివేళ దేవదేవుడైన మహావిష్ణువు దేవకి గర్భమందు బాలకృష్ణుడుగా జన్మించాడు. జగన్మోహనాకారుడైన చిన్నారి శిశువును చూసి వసుదేవుడు మురిసిపోయాడు. అప్పుడొక మహాద్భుతం జరిగింది. అప్పుడే పుట్టిన ఆ మగశిశువు శంఖ చక్ర గదా పద్మధారియే శ్రీమన్నారాయణుడుగా వారికి దర్శన మిచ్చాడు. శ్రీవత్సలాంఛనము, కౌస్తుభమణి, పీతాంబర వస్త్రములు, కనకమయ భూషణములతో ఒప్పారే ఆదివ్య మంగళరూపాన్ని చూసి దిగ్భ్రమ చెందాడు వసుదేవుడు. దేవదేవుడే తనకు బిడ్డగా పుట్టాడని ఊహించాడు.
‘ఇలాంటి అపూర్వ రూపలావణ్యుడైన శిశువును కాస్సేపట్లో కంసుడు చంపేస్తాడే’ అని మొదట్లో బాధపడ్డ వసుదేవుడు తరువాత ’ఈ శిశువు సామాన్యుడు కాడు. సాక్షాత్తు భగవంతుడే’ అనుకుని ఊరడిల్లాడు.
*****
శ్రీకృష్ణావతారము రెండవ భాగంలో బలరామకృష్ణుల విద్యాభ్యాసం, రుక్మిణీ, కృష్ణుల వివాహం, ప్రద్యుమ్న కుమారుని జననం, స్యమంతకమణి వృత్తాంతం, జరాసంధుని వృత్తాంతం, శిశుపాలుని వధ, సాళ్వునితో సమరం, కుచేలోపాఖ్యానం, మునివరులు యాదవులను శపించటం, కృష్ణావతార పరిసమాప్తి మొదలగు ఆధ్యాత్మిక కథల గురించి వివరించడం జరిగింది.
గమనిక: "శ్రీ కృష్ణావతారం 1 & 2" ఈబుక్ సైజు 19.3 mb

- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹108