-
-
శ్రీ కంచి కామకోటి పీఠ పరిపాలిత శ్రీ మన్మథ నామ సంవత్సర కాలనిర్ణయ పంచాంగమ్ 2015-2016
Sri Kanchi Kamakoti Peetha Paripalita Sri Manmatha Nama Samvatsara Kalanirnaya Panchangam 2015 2016
Publisher: Self Published on Kinige
Pages: 244Language: Telugu
పంచాంగము శ్రౌత స్మార్తాది సకల సత్కర్మానుష్టానములకు ఆధారభూతమైనది.
జటిల గణిత సాధ్యమైన పంచాంగణనము బహుప్రాచీన కాలము నుండి వారి వారి సాంప్రదాయములను అనుసరించి చేయబడుచున్నవి.
కాగా కొన్ని పంచాంగములయందు గ్రహణాది ప్రత్యక్ష గోచారములు కూడా తప్పిపోవు ప్రమాదములు మనము చూచుచున్నాము.
ఇట్టి దోషములు తప్పిదములు రాకుండా ఉండాలని కంచి పరమాచార్యుల వారు సుమారు ౧౧౦ సంవత్సరముల నుండి జ్యోతిష పంచాంగ పండిత సదస్సులను భారతదేశములోని ప్రముఖులైన జ్యోతిష, పంచాంగ, ఖగోళ, తర్క, మీమాంస, వ్యాకరణ, సంస్కృత, స్కంధత్రయ, మతత్రయ పండితులను, ధర్మశాస్త్ర పండితులను పిలచి శ్రీమఠమున నిర్వహించడము అవిచ్ఛినన్నముగా జరుగుతున్నది.
అట్టి సభయందు తెలంగాణ రాష్ట్రం, నల్లగోడ జిల్లా, ఆలేరు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు ప్రతి సంవత్సరము గణిస్తూ వెలువరిస్తున్న శ్రీ కాలనిర్ణయ పంచాంగములోని పండుగల, మౌఢ్య, పుష్కర, సంక్రమణ, గ్రహసంచార, గ్రహణ నిర్ణయములన్నియూ సశాస్త్రీయముగా ధర్మబద్ధముగా ఉన్నవి అని పై సదస్సు అమోదించటము జరిగినది.
శ్రీ మన్మథ నామ సంవత్సర కాలనిర్ణయ పంచాంగములో గోదావరి పుష్కరములపై ప్రత్యేక వివరణ, పుష్కర మాహత్మ్యం, నదీస్నాన సంకల్పం, అర్గ్యప్రధాన వివరములు సశాస్త్రీయముగా ఇవ్వబడినవి.
అధికమాస విశిష్టత పై ప్రత్యేక వ్యాసం ఇవ్వబడినది.
ప్రతేకముగా వివాహది మ్హూర్తముల విషయములలో ధర్మ శాస్త్ర వివరములు, పంచక రహితాది వివరములు, పుష్కర, వర్గోత్తమాంశ, శుభాంశలతో శుభముహూర్తములు, ప్రతిదిన గ్రహచక్రములు, ప్రతిదిన శ్రాద్ధ తిథి వివరములు, సంపూర్ణముగా సర్వులకూ అర్థమగు రీతిలో ఇవ్వడము జరిగినది.
బ్రహ్మశ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు ౧౯ సంవత్సరములకే పంచాంగ గణన చేసి అత్యధిక పిన్నవయస్సులో పంచాంగకర్తగా ప్రముఖులతో (జగద్గురు శ్రీశ్రీశ్రీకంచి స్వామివారు, మాజీ సిక్కిం గవర్నర్ రామారావ్ గారు, మరియు సి.నా.రే.) సన్మానము పొందుట, జ్యోతిష కేసరి బిరుదు పొందుట జరిగినది.
నల్లగొండ, రంగారెడ్డి వైదిక, అర్చక బ్రహ్మణ సంఘములకు ఆస్థాన సిద్ధాంతిగా వ్యవహరించుట, ౧౫౭ దేశములకు ప్రాంతీయ కాలసవరణలతో పంచాంగమును తయారు చేయుట, సైంటిఫిక్ జ్యోతిషం అనే అంశము మీద పరిశోధన చేయుచున్నారు
