-
-
శ్రీ హనుమత్ చరిత్ర
Sri Hanumat Charitra
Author: Nagineni Leela Prasad
Publisher: Victory Publishers
Pages: 191Language: Telugu
హనుమచ్చరిత్ర అనేకానేక అద్భుతాలకు, ఆదర్శాలకు ఆలవాలం. కార్యసాధనకు, సంభాషణాచాతురికి, ధైర్యసాహసాలకు, అనన్యమైన స్వామిభక్తికి ఆంజనేయస్వామి తార్కాణం. నిరంతరం ఆ స్వామి చరిత్రను భక్తి, విశ్వాసాలతో పారాయణ చేయటం వల్ల, తత్పభ్రావంతో ఒక చైతన్య స్ఫూర్తి లభిస్తుంది.
శ్రీమద్రామాయణంలో హనుమంతుని పాత్రతో వెలుగొందిన కథాఘట్టాల నన్నింటిని ఒక శ్లాఘనీయమైన క్రమంలో ఉంచి, ఈ హనుమచ్చరిత్రకు అపూర్వ ప్రయోజనాన్ని సమకూర్చారు శ్రీ లీలాప్రసాద్. భారతంలోని సౌగంధిక పుష్పవృత్తాంతాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు.
మండల దీక్షలు తీసికొని పావనిని ఉపాసించే వారికి ఈ హనుమచ్చరిత్ర కొంగు బంగారం. రోజుకొక భాగం పారాయణ చేయవచ్చు. దీక్ష స్వీకరించకపోయినా అలాగే పఠించవచ్చు. అద్భుత ఫలితం పొందవచ్చు. పారాయణకు ముందు, వెనుక చేయవలసిన పూజావిధిని, చివరిలో ఆంజనేయ స్తోత్రాలనుకూడా చేర్చటం మరింత ఉపయోగకరమైంది.
