• Sri Gitajnana Saramrutamu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ గీతాజ్ఞాన సారామృతము

    Sri Gitajnana Saramrutamu

    Publisher: K. Anil Kumar Raju

    Pages: 262
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description



శ్లో: మత్కర్మకృన్మత్పరమో మద్భక్త స్సంగ వర్జితః |

నిర్వైర్వ స్సర్వ భూతేషు యస్సమామేతి పాణ్డవ ||


తా: అర్జునా! ఎవడు నాకొరకే కర్మలు చేయునో, నన్నే పరమ ప్రాప్యముగా నమ్మియుండునో, నా యందే భక్తి కలిగి యుండునో, సమస్త దృశ్య పదార్థములందును సంగమును విడిచివేయునో, సమస్త ప్రాణులయందును ద్వేషము లేక యుండునో అట్టివాడు నన్ను పొందుచున్నాడు.



శ్లో: శ్రద్ధావాన్‌లభతే జ్ఞానం తత్పరస్సంయతేన్ద్రియః |

జ్ఞానంలబ్ద్వా పరాంశాంతి మచిరేణాధిగచ్ఛతి||


తా: శ్రద్ధ కలవాడును, తదేకనిష్ఠతో కూడినవాడును ఇంద్రియములను లెస్సగా జయించినవాడు నగు మనుజుడు జ్ఞానమును పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును పొందినవాడై యతడు పరమ శాంతిని శీఘ్రముగా బడయగల్గుచున్నాడు.



శ్లో: సత్యేన లభ్య స్తపసా హ్యేష ఆత్మా సమ్యగ్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యమ్ |

అంతః శరిరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః ||


తా: పాపములు నశించిన యత్నశీలురు ఎవనిని చూస్తారో అట్టి జ్యోతిర్మయము, పరిశుద్ధము అయిన ఈ ఆత్మ సత్యము చేత, తపస్సు చేత, సమ్యగ్ జ్ఞానము చేత, బ్రహ్మచర్యము చేత ఈ శరీరములోనే నిరంతరాయముగా లభ్యమవుతుందిగదా!



శ్లో: నాయమాత్మా ప్రవచనేన లభ్యో నమేధయా నబహునా శ్రుతేన |

య మేవైష వృణుతే తేన లభ్య స్తస్యైష ఆత్మా వివృణుతే తనుం స్వామ్ ||


తా: ఈ ఆత్మ ఉపన్యాసముల చేత లభ్యము కాదు! మేధాశక్తి చేత కాదు, చాలా ఎక్కువ వినడము చేతకాదు, ఈ ఆత్మను మాత్రమే ఏ సాధకుడు వరిస్తాడో ఆ వరించుట చేతనే ప్రాప్తించగలదు. అతనికి ఈ ఆత్మ తన స్వరుపాన్ని ప్రకటిస్తుంది.

ఓం తత్ సత్

Preview download free pdf of this Telugu book is available at Sri Gitajnana Saramrutamu