• Sri Geetagovindam
  • Ebook Hide Help
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ గీతగోవిందం

    Sri Geetagovindam

    Pages: 170
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“ శ్రీ గీతగోవిందం” లో వివిధ శ్లోకాలతో పాటు అక్కడక్కడా మొదట ఒక ధవళం, పిదప మంగళం- అనంతరం భ్రమర పదం- రెండు గీతికలు- పదిహేడు ధృవాలు రచింపబడ్డయి - మత్రాచ్ఛందోబద్ధాలైన యీ ధవళ- భ్రమర- ధ్రువ - గీతికాదులన్ని తెలుగు యక్షగానాలలో వలెనే రాగతాళ యుక్తాలుగా రచించబడ్డాయి.
ఈ శ్రీ గీతగోవిందం సుప్రసిద్ధమై అయినా ఇది సంస్కృతంలో పూర్వమే అవతరించిన తెలుగు యక్షగానకావ్యంవంటి, యక్షగాన కావ్యమని మనవారు గుర్తించక పోవడం ఆశ్చర్యంగా ఉన్నది - అంటారాయన.
యక్షగానం నాటక ప్రక్రియ ప్రదర్శన యోగ్యంగా ఉంటుంది.! కానీ, యక్షగానం కావ్యప్రక్రియ పాడుకోడానికి ఇంపుగా ఉంటుంది. త్యాగరాజుకవి రచించిన సీతారామ విజయం, నౌకాచరిత్ర, ప్రహ్లాద భక్తవిజయం వంటివి యక్షగానకావ్య ప్రక్రియకు తెలుగులో ఉదాహరణలుగా చెప్తారు. ఇవి జయదేవుడి ప్రభావాన తెలుగులో తర్వాతి కాలంలో వెలువడ్డ యక్షగాన కావ్యాలు!
పాటలు, శ్లోకాలూ కలిసిన యక్షగాన కావ్యం శ్రీ గీతగోవిందం. తేనె ద్రాక్ష కలిపినట్లుగా ఉంటుందంటారు! గోవిందుని గానం చేయడం జరుగుతోంది కాబట్టి దీన్ని గీతగోవిందం అన్నాడు జయదేవకవి.
కావ్యం ముగింపులో “యద్గాంధర్వ కలార్వసుకౌశల” అనే శ్లోకంలో “సానందాః పరిశోథయంతు సుధియః శ్రీ గీతగోవిందతః” - నిజమైన ఆనందంతో ఈ శ్రీ గీతగోవిందం కావ్యాన్ని పరీక్షించుకోండి - అంటాడు శ్రీ జయదేవకవి !
జన వ్యవహారంలో ఇది ‘గీతగోవిందం’ కావ్యంగానే నామకరణం చేశాడనడానికి ఈ ఉదాహరణ సరిపోతుందంటారు పెద్దలు.
‘జయదేవుడి గీతగోవిందం’ అనేది జనంలో వ్యాప్తిలో ఉన్నదే! ప్రజాదరణ ఎక్కువగా ఉన్నప్పుడు శ్రీ రహితంగా చెప్పుకోవడం, ఆ ప్రజల ఆత్మీయతకు ఒక తార్కాణం - అంతే !
ఇదీ శ్రీ జయదేవుని శ్రీ గీతగోవిందం కథ ! ఇది మధుర కోమల కాంత పదావళులు అయిన శ్రీ జయదేవుని అష్టపదుల కథ !
ఇది తేనెలూరు తేటతెలుగు పదాలు పొదిగిన మానసోల్లాస వ్యాఖ్య కథ !
ఇది అమలిన ప్రేమకథ !!

- డా. జి.వి. పూర్ణచందు

Preview download free pdf of this Telugu book is available at Sri Geetagovindam