• Sri Devi Stotramanjari
 • Ebook Hide Help
  ₹ 60
  60
  0% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • శ్రీ దేవీ స్తోత్రమంజరి

  Sri Devi Stotramanjari

  Pages: 80
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

మన ఆధ్యాత్మిక వాఙ్మయంలో స్తోత్రాలకి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. వేదాలలోని సూక్తాలు అన్నీ స్తోత్ర వాఙ్మయానికి చెందినవే. ఇక పురాణాల విషయానికి వస్తే వ్యాసభగవానుడు రచించిన అష్టాదశ పురాణాలు - ఉపపురాణాలలో ఎందరో దేవీ-దేవతల స్తోత్రాలు, స్తుతులు, కవచాలు పొందుపరచబడ్డాయి. ఈ స్తోత్రాలన్నీ వివిధసందర్భాలలో ఋషులచేత, మునులచేత, ఇంద్రాది దేవతలచేత, అష్టదిక్పాలకుల చేత, హరిహర బ్రహ్మాదులచేత చేయబడ్డాయి. కనుక ఇవి ఎంతో మహిమాన్వితమైనవి.

పూజలు, వ్రతాలు, నోములు వంటివి కొంత శ్రమతో కూడుకొన్నవి. అదే స్తోత్రాలైతే ప్రతిరోజూ ఎక్కువ శ్రమలేకుండా మనకు నచ్చిన స్తోత్రాల్ని పఠించవచ్చు. దేవతలందరూ స్తుతి ప్రియులు కాబట్టి వారిని స్తోత్ర పఠనాల ద్వారా సంతృప్తి పరిస్తే మనకు కష్టాలు బాధలు వారి కరుణతో పటాపంచలైపోతాయి.

‘శ్రీ దేవీ స్తోత్రమంజరి’ అనే ఈ గ్రంథంలో శ్రీ జగన్మాతకు సంబంధించిన వివిధ రకాల స్తోత్రాలని సూక్తాలని స్తుతుల్ని కవచాలని అందిస్తున్నాము. శ్రీ దేవీ భక్తులందరూ భక్తి శ్రద్ధలతో వీటిని పఠిస్తే దేవీ అనుగ్రహానికి పాత్రులవుతారు.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Sri Devi Stotramanjari